లెనిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్లాదిమిర్ లెనిన్
Владимир Ленин
1920లో లెనిన్
సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఛైర్మన్
In office
1923 జులై 6 – 1924 జనవరి 21
అంతకు ముందు వారుఆఫీసు స్థాపితం
తరువాత వారుఅలెక్సీ రైకోవ్
రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ప్రభుత్వ ఛైర్మన్
In office
1917 నవంబరు 8 – 1924 జనవరి 21
అంతకు ముందు వారుఆఫీసు స్థాపితం
తరువాత వారుఅలెక్సీ రైకోవ్
రష్యన్ అసెంబ్లీ మెంబరు
In office
1917 నవంబరు 25 – 1918 జనవరి 20[a]
Serving with పవెల్ డిబెంకో
అంతకు ముందు వారుఎలక్టోరేట్ స్థాపితం
తరువాత వారుఎలక్టోరేట్ రద్దు
నియోజకవర్గంబాల్టిక్ ఫ్లీట్
వ్యక్తిగత వివరాలు
జననం
వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉల్యనోవ్

(1870-04-22)1870 ఏప్రిల్ 22
సింబిర్స్క్, రష్యన్ సామ్రాజ్యం
మరణం1924 జనవరి 21(1924-01-21) (వయసు 53)
గోర్కి, మాస్కో గవర్నరేట్,రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోవియట్ యూనియన్
ఖననం
లెనిన్ మౌసోలియం, మాస్కో, రష్యన్ ఫెడరేషన్
జాతీయతరష్యన్
సోవియట్
రాజకీయ పార్టీ
  • రష్యన్ సోషియల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ(1898–1903)
  • రష్యన్ సోషియల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ (బోల్షెవిక్) (1903–12)
  • బోల్షెవిక్ పార్టీ] (1912–18)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ (1918–24)
ఇతర రాజకీయ
పదవులు
లీగ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ (1895–1898)
జీవిత భాగస్వామి
నడేజ్డా కృపస్కాయా
(m. 1898)
బంధువులు
  • అలెగ్జాండర్ ఉల్యనోవ్ (సోదరుడు)
  • అన్నా ఉల్యనోవా (సోదరి)
  • దిమిత్రీ ఇలిచ్ ఉల్యనోవ్ (సోదరుడు)
  • మరియా ఇల్యినిచ్నా ఉల్యనోవా (సోదరి) ఇంకా ముగ్గురు సోదర సోదరీమణులు
తల్లిదండ్రులు
  • ఇల్యా ఉల్యనోవ్
  • మరియా అలెక్సాండ్రోవా ఉల్యనోవా
కళాశాలసెయింట్ పీటర్స్ బర్గ్ ఇంపీరియల్ యూనివర్శిటీ
సంతకం
Central institution membership

మిలిటరీ స్థానం
  • 1918–1920: ఛైర్మన్, కౌన్సిల్ ఆఫ్ లేబర్ అండ్ డిఫెన్స్
సోవియట్ యూనియన్ లీడర్
  • First holder
  • స్టాలిన్

లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ (ఆంగ్లం: Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) (ఏప్రిల్ 22, 1870జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజమ్ లేదా మార్క్స్సిజమ్-లెనినిజమ్ అని అంటారు.

బాల్యం

[మార్చు]
1887లో లెనిన్

1917జూన్ లో అఖిల రష్యా సోవియట్ కాంగ్రేస్ సమావేశాలు జరిగాయి. అందులో బోల్షివిక్ సంఖ్య 105 మాత్రమే. మొత్తం ప్రతినిధులు 822, యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శన కారణంగా లెనిన్ ఫిన్లండ్ పారిపోవలసి వచ్చింది. 1917 సెప్టెంబరు నాటికి మాస్కో, పెట్రోగ్రాడ్ సోవియట్లలో అధిక సంఖ్యాకులు బోల్షివిక్ లు. ఈ సోవియట్లకు అధికారం హస్తగతం కావాలనేదే లెనిన్ నినాదం.


పోలిట్ బ్యూరో స్థాపన

అక్టోబరులో రహస్యంగా లెనిన్ పెట్రోగ్రాడ్ చేరి, మొట్ట మొదటిసారిగా పోలిట్ బ్యూరో స్థాపించాడు. అక్టోబరు 25న సోవియట్ల సమావేశం జరిగింది. మరునాడు పెట్రోగ్రాడ్ లో కీలక స్థావరాలన్నీ బోల్షివిక్కులు ఆక్రమించారు. తరువాత రాజ్యాంగసభ నిమిత్తం ఎన్నికలు జరిగాయి. మొత్తం 707 స్థానాలలో బోల్షివిక్కులకు 175 వచ్చాయి. ఆ విధంగా బోల్షివిక్కులు ఏనాడూ అధిక సంఖ్యలో లేరు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండు రోజులకే, లెనిన్ పత్రికా స్వేచ్ఛను అరికట్టాడు. లెనిన్ అధికారాన్ని పట్టుకున్న తరువాత ఒక రహస్య సైనిక సంస్ధను స్థాపించాడు. ఆల్ రష్యన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ కమిషన్ ను పొడిగా చేకా అంటారు. ఈ రహస్య సంస్థ లెనిన్ వున్నంతకాలం బయటవారికి తెలియలేదు. 1917 డిసెంబరులో మొదలు బెట్టి యీ చేకా సంస్థ చిలవలు పలవలుగా, నాగు జెముడువలె పెరిగి ప్రాకిపోయింది. స్థానిక సోవియట్లు సమాచారం అందిస్తుండగా, మూడేళ్ళలో చేకా రహస్యసంస్థ 2,50,000 మందిని చేర్చుకున్నది నెలకు సగటున వెయ్యిమందిని రష్యాలో లెనిన్ నాయకత్వాన, విప్లవ వ్యతిరేకుల పేరిట ఉరితీసినఖ్యాతి యీ రహస్య సంస్థకు దక్కింది.


విప్లవ కార్యక్రమాలు, దేశ బహిష్కారం

[మార్చు]

తన 31వ ఏట లెనిన్ మారుపేరు ధరించాడు (1901లో). తల్లిదండ్రులిరువురూ క్రైస్తవులు, కాని, లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరామంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు. పొలంపనులకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరించాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు. ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందాడు. లెనిన్ ను సన్నిహితంగా పార్టీలో చూచినవారు ఆయన నియంతృత్వ పోకడలపై దాడిచేశారు. ప్లెఖనోవ్, వేరా జెసూలిక్, ట్రాటస్కీ, మదాం క్రిజిజెనోవిస్కియా, చార్లస్ రాపాఫోర్ట్, వై ఛస్లావ్ మెంజిస్కీ మొదలైన వారంతా లెనిన్ను తెగిడారు. కాని ఇలాంటి తిట్లను, శాపనార్ధాలను, విమర్శలను లెనిన్ ఏనాడూ ఖాతరు చేయలేదు. ఎనుబోతుపై వర్షం పడ్డట్లే విమర్శల దారి విమర్శలదే, లెనిన్ గొడవ లెనిన్ దే. అదే ఆయన ఏకాగ్రత విశిష్టత. 1905లో రష్యా విప్లవం విఫలమైనప్పుడు లెనిన్ విస్తుబోయాడు. అయినా నిరాశ చెందలేదు. 1914లో మొదటి ప్రపంచయుద్ధం లెనిన్ కు దిగ్ర్భాంతిని కలిగించింది. జార్ చక్రవర్తి పతనం చూచి లెనిన్ ఆశ్చర్యపోయాడు. అంతర్జాతీయంగా సోషలిస్టు ఉద్యమం విఫలం గావడం లెనిన్ కు అత్యంత నిరాశ కలిగించింది. చివరకు 1917లో బ్రతికుండగా విప్లవ విజయాన్ని చూస్తానా అని లెనిన్ నిరాశతో వాపోయాడు.

రష్యాకు తిరిగి రాక

[మార్చు]

రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్ధం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో ఉన్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు. 1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు. జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.

సోవియట్ యూనియన్ అధినేత

[మార్చు]

వూచకోత

[మార్చు]

తన అధికారానికి బయటా, లోపల తిరుగులేకుండా చెసుకోడానికి లెనిన్ చేయవలసిన దారుణ కృత్యాలన్నీ చేశాడు. జర్మనీవారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, లెనిన్ వారితో సంధి చేసుకున్నాడు. అంతటితో రష్యాకు జర్మనీ సైవ్యాల బెడద ఆగింది. లెనిన్ రాక్షసకృత్యాలకు అంతరంగికంగా మరింత అవకాశం చిక్కింది. ఇందుకు అండగా నిలిచినవాడు స్టాలిన్.

చివరి రోజులు,మరణం

[మార్చు]

1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించిన లెనిన్ 1921 జూలైలో ఒక నెల విశ్రాంతి తీసుకున్నాడు. పనితగ్గించమని ఆగస్టులో పోలిట్ బ్యూరో ఉత్తరువులిచ్చింది. 1922లో అలాంటి ఉత్తరువులు తిరిగి యిచ్చారు. 1922 మే నుండి అక్టోబరు 2 వరకూ లెనిన్ విశ్రాంతి తీసుకోగా, తిరిగి వచ్చిన అనంతరం కూడా అధికార పత్రాలు అందుబాటులో లేకుండా చేశారు.లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. లెనిన్ రహస్యంగా పనిచేస్తూ తన భార్య కృపస్క మాకు ఉత్తరాలు చెప్పి వ్రాయించడం స్టాలిన్ కు నచ్చలేదు.

1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమిషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.

మూలాలు

[మార్చు]

కొన్ని రచనలు

[మార్చు]

చదువదగిన రచనలు

[మార్చు]
  • Cliff, Tony (1986). Building the Party: Lenin, 1893-1914. Haymarket Books. ISBN 1-931859-01-9.
  • Fischer, Louis (2001). The Life of Lenin. Orion Publishing Co. ISBN 1-84212-230-4.
  • Gooding, John (2002). Socialism In Russia: Lenin and His Legacy, 1890-1991. Palgrave Macmillan. ISBN 0-333-97235-X.
  • Lenin, Vladimir (2002). Revolution at the Gates: A Selection of Writings from February to October 1917 by V. I. Lenin. Verso Books. ISBN 1-85984-661-0.
  • Kolakowski, Leszek; Falla, P. S. (2005). Main Currents of Marxism. W. W. Norton & Company. ISBN 0-393-06054-3.
  • Pannekoek, Anton; Richey, Lance Byron (2003). Lenin as Philosopher. Marquette University Press. ISBN 0-87462-654-4.
  • Payne, Robert (1967). The Life And Death Of Lenin. Simon & Schuster. ISBN 0-671-41640-5.
  • Pipes, Richard (1999). The Unknown Lenin: From the Secret Archive. Yale University Press. ISBN 0-300-07662-2.
  • Service, Robert (2002). Lenin: A Biography. Belknap Press. ISBN 0-674-00828-6.
  • Shub, David (1965). Lenin: A Biography. Penguin Books. ISBN 0-14-020809-7.
  • Toynbee, Arnold (July 1970). "A Centenary View of Lenin". International Affairs. 46 (3): 490–500. doi:10.2307/2613225. ISSN 0020-5850.
  • Trotsky, Leon (1971). On Lenin: Notes Towards a Biography. Harrap Publishing. ISBN 0-245-50302-1.
  • Tucker, Robert C. (1975). The Lenin Anthology. W. W. Norton & Company. ISBN 0-393-09236-4.
  • Volkogonov, Dmitri (2006). Lenin: A New Biography. Free Press. ISBN 0-02-933435-7. Dmitrij Volkogonov: Lenin. Počátek teroru. Dialog, Liberec 1996, 399 pp. (Czech edition)

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=లెనిన్&oldid=4316433" నుండి వెలికితీశారు