సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం
Jump to navigation
Jump to search
సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | అండమాన్ నికోబార్ |
Area | 85.47 కి.మీ2 (33.00 చ. మై.) |
Established | 1979 |
సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం 1979లో స్థాపించబడింది. ఇది 85.47 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడి వాతావరణం సాధారణంగా 20-30 ° C (68–86 ° F) మధ్య మారుతూ ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది.[2]
జంతుజాలం
[మార్చు]ఈ ఉద్యానవనంలో సముద్ర ఉష్ణోగ్రతలలో నివసించే జంతువులు సంరక్షించబడుతున్నాయి. అందులో అండమాన్ అడవి పంది, అండమాన్ హిల్ మైనా, అండమాన్ ఇంపీరియల్ పావురం, వాటర్ మానిటర్, డాల్ఫిన్లు, తిమింగలాలు, ఉప్పునీటి మొసలి వంటి అనేక జంతువులు సంరక్షించబడుతాయి.
వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యానవనం చుట్టూ తేమ, ఉష్ణమండల వృక్షసంపదతో పాటు ఆకురాల్చే సతత హరిత అడవులు ఇందులో ఉన్నాయి. అందులో స్కోలోపియా పుసిల్లా, క్లిస్టాంతస్ రోబస్టస్ జాతుల వృక్షాలు ఇందులో పెరుగుతాయి. ఈ వృక్షాలు భారతదేశంలో అరుదుగా కనిపిస్తాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ Bisht, R.S. (1995). National parks of India. New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. p. 71. ISBN 8123001789.
- ↑ Negi, S.S. (2002). Handbook of national parks, wildlife sanctuaries, and biosphere reserves in India (3rd rev. ed.). New Delhi: Indus Pub. Co. p. 52. ISBN 8173871280.
- ↑ New Reports to the Flora of India from Saddle Peak National Park, North Andaman. Rheedea. Vol. 19 (1 & 2) 69-71. 2009