ముస్లింల ఆచారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసాల క్రమం
ఇస్లామీయ సంస్కృతి

నిర్మాణాలు

అరబ్ · అజేరి
ఇండో-ఇస్లామిక్ · ఇవాన్
మూరిష్ · మొరాక్కన్ · మొఘల్
ఉస్మానియా · పర్షియన్
సూడానో-సహేలియన్ · తాతార్

కళలు

ఇస్లామీయ లిపీ కళాకృతులు · మీనియేచర్లు · రగ్గులు

నాట్యము

సెమా · విర్లింగ్

దుస్తులు

అబాయ · అగల్ · బౌబౌ
బురఖా · చాదర్ · జెల్లాబియా
నిఖాబ్ · సల్వార్ కమీజ్ · తఖియా
తాబ్ · జిల్‌బాబ్ · హిజాబ్

శెలవు దినాలు

ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్
చాంద్ రాత్ · ఈదుల్ ఫిత్ర్ · బక్రీద్
ఇమామత్ దినం · అల్ కాదిమ్
సంవత్సరాది · ఇస్రా, మేరాజ్
లైలతుల్ ఖద్ర్ · మీలాదె నబి · రంజాన్
ముగామ్ · షాబాన్

సాహిత్యము

అరబ్బీ · అజేరి · బెంగాలి
ఇండోనేషియన్ · జావనీస్ · కాశ్మీరీ
కుర్దిష్ · పర్షియన్ · సింధి · సోమాలి
దక్షిణాసియా · టర్కిష్ · ఉర్దూ

సంగీతము
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి

మఖామ్ · ముగామ్ · నషీద్
ఖవ్వాలి

థియేటర్

కారాగోజ్, హాకివత్ · తాజియా

ఇస్లాం పోర్టల్
ఇస్రాయీలు లోని ఒక యువ బెదుయీన్ ఉత్తర ఆఫ్రికా నమూనాలో ఫెజ్ ధరించాడు.

ముస్లింల ఆచారాలు. ముస్లిం అనగా ఇస్లాంను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు. ఇస్లాం సూచనలకు మూలాధారాలు: ఖురాన్, సున్నహ్, హదీసులు, షరియా.

ముఖ్య గమనిక: ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.

మీలాద్-ఉన్-నబి సందర్భంగా సమావేశం.

ఆచారాలకూ చేష్ఠలకూ మూఢవిశ్వాసాలకూ తేడాలు:

ఆచారం: ముస్లింలు పరస్పరం 'సలాము' చేసుకోవడం ఆచారం. ఈ ఆచారం ఎంతో పరిశుధ్ధమైనది. దీని ఉదాహరణ ముస్లిమేతరులుకూడా ఇస్తారు.
చేష్టలు: ఉదాహరణకు అరేబియాలో కొందరు అరబ్బులు ఒంటెల పందెం లో, ఒంటెలను ఉత్సాహపరచేందుకో లేక బెదిరించి పరుగులంకించుకొనేం దుకో, ఒంటెలకు పసిపిల్లలను కట్టేశారట. పసిబిడ్డలు చేసే అర్తనాదాలకు ఆ ఒంటెలు బెదిరి పరుగులంకించేవట. ఈ మధ్య ఈ వార్త ప్రపంచమంతా గుప్పుమంది. ఆ అరబ్బులు ముస్లింలు, వారు చేసిన చేష్టలు ఇస్లాం బోధించినవికావు.
మూఢ విశ్వాసం: కొందరు మౌల్వీలు, జిన్ లు తమ వశంలో ఉన్నాయని, వాటి ద్వారా ఏలాంటి కార్యాలైనా సిధ్ధింపజేస్తామని పామరులకు నమ్మబలికి వారివద్దనుండి డబ్బులు రాబట్టడం తరచూ చూస్తూంటాము. ముస్లింలై ఉండీ అల్లాహ్ పై బలమైన విశ్వాసంలేని వారు, ఇలాంటి మూఢనమ్మకాల షికారు అవుతారు. షికారుచేయువాడు ధార్మికవిషయాలు తెలిసినవాడేనని మరువకూడదు. కానీ ఇతనికి తెలిసింది అసత్యమనేది సత్యం.

ఈ చేష్టలు, మూఢవిశ్వాసాలనుండి ప్రజలను బయటపడవేయడానికే ఇస్లాం అవతరించింది. ఇస్లాం సదాచారాలకు పుట్టినిల్లు. ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు. అందరూ అంగీకరించే ముస్లిం ఆచారాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

వివాహం

[మార్చు]
ఓ ముస్లిం వధువు 'నికాహ్ నామా లో సంతకం చేస్తూ.

ఇస్లాం నికాహ్ లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది. నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. సున్నత్ బ్రహ్మచర్యాన్నీ, వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలో ఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్ధీకరిస్తుంది. వ్యభిచారం లేదా హరామ్ నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు. ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం. దుబారా ఎక్కువ. భారతదేశంలో ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు, ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు. వీళ్లెవరూ నూర్ బాషా, దూదేకుల సాయిబుల్ని పెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్, పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తిని కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్ఠూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.

నామకరణాలు

[మార్చు]

సాధారణంగా పిల్లలు పుట్టినపుడు మొదటి నెలలోనే నామకరణం చేస్తారు. ధార్మిక పురుషుల పేర్లు, ప్రకృతికి సంబంధించిన పేర్లు, సాహితీ సంబంధమైన పేర్లు పెడుతుంటారు. ఉదాహరణకు;

  • ధార్మిక పరమైనవి : మగపిల్లలకైతే, అల్లాహ్ యొక్క విశేష నామాలైన రహీం, కరీం, రహ్మాన్, సత్తార్, గఫ్ఫార్, ఖయ్యూం, వగైరాలు. ప్రవక్తల పేర్లు, సహాబాలు లేదా ఆలియాల పేర్లు పెడుతారు. ఉదా: ఆదం, ఇద్రీస్, ఇబ్రాహీం, మూసా, ముహమ్మద్, అహ్మద్, అలీ, హసన్, హుసైన్, మొహియుద్దీన్, మొదలగునవి. ఆడపిల్లలకైతే, మరియం, హాజిరా, సారా, అమీనా, హలీమా, ఫాతిమా, జహ్రా, ఆయేషా, సకీనా, జూలైఖా మొదలగునవి.

సలాము చేయుట

[మార్చు]

ముస్లింలు తోటి ముస్లింలను పలుకరించే పద్ధతి ఇది. "అస్సలాము అలైకుమ్" దీని అర్థం నీపై శాంతి కలుగుగాక. దీనికి ప్రత్యుత్తరంగా వా అలైకుం అస్సలాం అని బదులిస్తారు. అస్సలాము అలైకుమ్ అనునది అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అనే పలకరింపునకు సంక్షిప్త రూపము.

పురుషులు గడ్డాన్ని పెంచడం (చెహరా)

[మార్చు]
ఉస్మానియా సామ్రాజ్యపు సుల్తాన్ సలీమ్ III.

ఇస్లాంలో పురుషులు గడ్డాన్ని పెంచడం తప్పనిసరి కాదు. ఇది సున్నత్ (ఐఛ్ఛికము) మాత్రమే. మీసాలు తీసివేసి కేవలం గడ్డాన్ని పెంచడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. దీనిని చెహరా అని అంటారు.

పురుషులు టోపీ ధరించడం

[మార్చు]

ముహమ్మద్ ప్రవక్త (ఆయనపై శాంతి శుభాలు వర్షించునుగాక) ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవారు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు, గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.

ఈద్ ముబారక్

[మార్చు]

పండుగల సందర్భంగా ఈద్ ముబారక్ తెలుపుతారు. "ఈద్ ముబారక్" అనగా "ఈద్ శుభాకాంక్షలు" లేదా "పండుగ శుభాకాంక్షలు". ప్రధాన పండుగలైన ఈదుల్ ఫిత్ర్ (రంజాన్ పండుగ), ఈదుల్ అజ్ హా (బక్రీదు పండుగ) సందర్భంగా ఈద్ ముబారక్ అని సంబోధిస్తారు. అనంతరం "తఖబ్బల్ అల్లాహు మిన్న వ మిన్కుమ్ " అంటే "మనందరి పుణ్యకారాలను అల్లా స్వీకరించుగాక " అని పరస్పరం దువా చేస్తారు.

స్త్రీలు హిజాబ్ ధరించడం

[మార్చు]
హిజాబ్కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, టర్కీ; దుబాయి యు.ఏ.ఇ.; టెహరాన్ ఇరాన్;, జైపూర్, రాజస్థాన్, భారతదేశం.

హిజాబ్ లేదా పరదా (అరబ్బీ: حجاب )

ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, సద్-నీతి.[1] ఈ పదము ఖురాన్ లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడింది. దీనినే ఉర్దూలో పరదా లేదా నఖాబ్, అరబ్బీలో 'ఖిమార్' خمار అంటారు.

ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. బురఖా భారతీయ, ఆఫ్ఘానీ, ఇరాకీ, ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడ ఉన్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.

సమాధులను సందర్శించడం

[మార్చు]
దస్త్రం:Dargah sharif.jpg
The Qawwali is the art of Singing a Song in the Praise of Islamic Personalities.
అత్యధిక ముస్లింలు ఔలియాల సమాధుల వద్దకు దుఆ చేయుటకు వెడతారు.

ఇస్లాంలో సమాధులను సందర్శించడం నిషేధం కాదు. సమాధులను సందర్శించే అసలు కారణం మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. లేదనగా మానవుడు ఈ లోకంలోనే అనంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ప్రపంచం వైపు పరుగెత్తి, అధర్మాల పాలవుతాడు. ఏనాటికైనా మనమందరం మరణిస్తామనే ఆలోచన రేకెత్తిస్తే, అతడి జీవితం కుదుటపడి, న్యాయ ధర్మమార్గాన్ని ఆచరించుటకు ప్రయత్నిస్తాడు. మానవులు 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించినపుడు, పాప కర్మములనుండి దూరంగా ఉంటూ సత్యమైన జీవితాన్ని గడుపుటకు ఉద్యుక్తుడౌతాడు. అల్లాహ్ను గ్రహిస్తాడు. ధర్మమార్గానికి వచ్చి తీరుతారు.


నిషేధితాలు:

  • సమాధుల వద్ద సాష్టాంగ ప్రణామాలు చేయరాదు.
  • సమాధులలో వున్న వారితో నోములు (మన్నత్ లు) నోచరాదు.
  • సమాధులలో ఉన్న వారితో ప్రార్థనలు చేయరాదు. కారణం అన్ని ప్రార్థనలు ఆలకించువాడు, తీర్చువాడు అల్లాహ్ ఒక్కడే.
  • సమాధుల చుట్టూ 'తవాఫ్' (ప్రదక్షిణ) లు చేయరాదు.
  • సమాధుల వద్ద ఔలియాలను స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా మన్ ఖబత్లు పాడుకుంటూ ఉండిపోరాదు. ఇలా చేస్తూ పోతే అసలైన ఈశ్వరుడిని (అల్లాహ్) ను మరచిపోతారు.
  • సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారాలు అనే వింత పోకడను విడనాడాలి.
  • తల నీలాలు సమర్పించరాదు.
  • సమాధులలో నిద్రించేవారి పేరున, ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించరాదు. కారణం ఔలియాలు ఇవన్నీ నేర్పించలేదు. ఇలాంటి మూఢ, అంధవిశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగి 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి, ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.

ఆచారాల పరంగా ముస్లింలలో నేటి స్థితి

[మార్చు]

ఇస్లాంలో ఏకేశ్వరూపాసన కఠోర నియమము.

విగ్రహారాధనను ఇస్లాo నిషేధించినది.

ముస్లింలు విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించరు. కాని దక్షిణ ఆసియా, పర్షియన్, షియా మతం యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో క్రింది విషయాలు గోచరిస్తాయి. భారతదేశంలోని ముస్లిం సమాజాలలో వీటి ప్రవేశం ఎలా జరిగిందంటే, నవాబులు దాదాపు షియా మతానికి చెందినవారు. ఉదాహరణకు లక్నో నవాబు, అవధ్ నవాబు, బెంగాలు నవాబు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీ వంశము, ఆసఫ్ జాహీ వంశము, టిప్పూ సుల్తాన్, ఆర్కాడు నవాబు, మదురై నవాబు, వీరందరూ షియా తెగ వాళ్ళే. వీరి పరిపాలనా కాలంలో చాలా దర్గాలు, ఆషూర్ ఖానా లు, ముహర్రం పీర్ల పండుగలు, (నేటికినీ లక్నో, హైదరాబాదు నగరాలలో చూడవచ్చును), ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలిశాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళిని కాపాడడానికే ఇస్లాం అవతరించింది. కాని, నేటికినీ చాలా మంది ముస్లింలు 'అజ్ఞాన కాలం'లోనే విహరిస్తున్నారనే భావన నేటి లోకం భావిస్తున్నది. పెద్ద పెద్ద ముస్లిం సుల్తానులు ఔలియా ల వద్ద నోములు నోచితే (ఉదాహరణకు అక్బర్ తనకు సంతానం లేదని సలీం చిష్తీ అనే సూఫీ ఔలియా సమాధి వద్ద మన్నత్ (నోము) చేశాడు) సాధారణ జనం అలాంటి చక్రవర్తులను అనుకరించడంలో అతిశయోక్తిలేదు.

  • దర్గాలు
  • జెండా మానులు (జెండాలు తగిలించిన వృక్షాలు)
  • పంజాలు (మొహర్రంలో ప్రతిష్ఠించే పీర్లు)
  • ఔలియాల నషాన్లు (ఔలియా ల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)

పైన ఉదహరించిన విషయాలు ఇస్లాంలో కానరావు.

ప్రవక్తవారు (ఆయనపై శాంతి శుభాలు వర్షించునుగాక) గాని సహబాలు గాని వీటిని చేసినట్టు ప్రమాణం దొరకదు.

పురుషులకు ఖత్నా (సున్తీ) చేయడం

[మార్చు]
Circumcision being performed in central Asia (probably Turkestan), c. 1865–1872. Restored albumen print.

పురుషులకు సున్తీ చేయించడం ఇస్లాం ఆచారం. కొందరు బిడ్డ పుట్టగానే సున్తీ చేయిస్తే మరికొందరు ఒక వయస్సు వచ్చాక చేయిస్తారు. పూర్వం వీటిని మంగలి వారిచే చేయించేవారు. ప్రస్తుతము వైద్యుల ద్వారా సున్తీ చేయిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో దీనిని సుల్తాం', ఖత్నా, వడుగులు అనే పేర్లతో పిలుస్తారు.

పిల్లలకు అఖీఖా చేయడం

[మార్చు]

శిశువు పుట్టిన ఏడు రోజులకు అఖీఖా చేయడము ప్రవక్త వారి సాంప్రదాయము (సున్నత్).పుట్టుకతో వచ్చే వెంట్రుకలను తొలగించే ప్రక్రియనే అఖీఖా అంటారు. మగ పిల్లవాడు అయితే రెండు పొట్టేళ్లను, ఆడపిల్ల అయితే ఒక పొట్టేలు దైవానికి కృతజ్ఞతగా జీహబ్ చేసి అందరినీ పిలిచి విందు ఇస్తారు లేక బీదలకు దానం చేస్తారు.

పిల్లలకు బిస్మిల్లాఖ్వానీ చేయడం

[మార్చు]

పిల్లలకు బడికెళ్ళే వయస్సు లేదా విద్యాభ్యాసన వయస్సు వచ్చినపుడు పిల్లల చేత చదువు అభ్యాస ప్రారంభ పరచే ఒక ఆచారం. పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు వయస్సు వచ్చినపుడు ఈ ఆచారం నిర్వహిస్తారు. దీనినే ఖురాన్ ఖ్వానీ అని కూడా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో బాలుడు లేక బాలిక విద్యాభ్యాసం ఖురాన్ పఠనంతో మొదలుపెడతారు. "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" - 'చదువు, అల్లాహ్ పేరుతో' (అరబ్బీ: ఇక్రా బిస్మి రబ్బుకల్లజి ఖలక్) అనే వాక్యంతో విద్యాభ్యాసం ప్రారంభిస్తారు.

చిత్ర మాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. Esposito, John (2003). The Oxford Dictionary of Islam. Oxford University Press. ISBN 0-19-512558-4., p.112

బయటి లింకులు

[మార్చు]