ముజ్తార్ ఖైరాబాదీ
ముజ్తార్ ఖైరాబాదీ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఇఫ్తీకర్ హుస్సేన్ 1865 ఖైరాబాద్, ఉత్తర ప్రదేశ్, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1927 మార్చి 27 గ్వాలియర్, మధ్యప్రదేశ్, బ్రిటీష్ ఇండియా | (వయసు 64–65)
వృత్తి | కవి |
భాష | ఉర్దూ |
జాతీయత | భారతీయుడు |
సంతానం | జాన్ నిసార్ అక్తర్ |
బంధువులు | ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ (తాత) జావేద్ అక్తర్ (మనవడు) సల్మాన్ అక్తర్ (మనవడు) ఫర్హాన్ అక్తర్ (మునిమనవడు ) జోయా అక్తర్ (మనవరాలు) కబీర్ అక్తర్ (మనవడు) |
ఇఫ్తీకర్ హుస్సేన్ (1865 - 1927) ఉత్తర ప్రదేశ్కు చెందిన ఉర్దూ కవి.[1][2] ఇతని కలంపేరు ముజ్తార్ ఖైరాబాది.
జీవిత విషయాలు
[మార్చు]ఖైరాబాది 1865లో ఉత్తర ప్రదేశ్ లోని ఖైరాబాద్‌లో జన్మించాడు.[3] కవి, తత్వవేత్త, మత పండితుడు, అరబిస్ట్, పర్షియన్, ఉర్దూ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడైన ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ మనవడు. ఖైరాబాదీ తల్లి మొదటి గురువుగా అన్ని విషయాలను నేర్పించింది.[4] ఖైరాబాద్, టోంక్, గ్వాలియర్, ఇండోర్, భోపాల్, రాంపూర్ లలో తన జీవితాన్ని గడిపాడు.
కుటుంబం
[మార్చు]ఖైరాబాదీకి ఒక కుమారుడు (కవి-గీత రచయిత జాన్ నిసార్ అక్తర్), ఇద్దరు మనవళ్ళు (జావేద్ అక్తర్, సల్మాన్ అక్తర్),[4][5] మునిమనవళ్ళు ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, కబీర్ అక్తర్ ఉన్నారు.[5]
బిరుదులు
[మార్చు]ఖైరాబాదీ ఇఫ్తీకర్-ఉల్-షౌరా, ఈత్బర్-ఉల్-ముల్క్ బిరుదులను అందుకున్నాడు.[4]
రచనా ప్రస్థానం
[మార్చు]ఖైరాబాది అనేక కవితా పుస్తకాలు రాశాడు. కరిషామా-ఎ-దిల్బార్ పేరుతో ఒక సాహిత్య పత్రికను కూడా ప్రచురించాడు.[4]
రచనలు
[మార్చు]రాసిన వాటిలో కొన్ని:[4]
- నజ్ర్-ఎ-ఖుదా (దేవుని స్తుతిలో కవితా సంకలనం)
- మీలాడ్-ఇ-ముస్తఫా
- బెహర్-ఎ-తవీల్ (పద్యం)
- మార్గ్-ఎ-ఘలత్ కి ఫరియాద్ (గజల్)
మరణం
[మార్చు]ఖైరాబాది 1927, మార్చి 27న గ్వాలియర్‌లో మరణించాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Incorrect verses". The Tribune India.com. 2005-01-02. Retrieved 2022-01-16.
- ↑ "A vein of grief". The Hindu. 2002-06-23. Archived from the original on 2003-07-03. Retrieved 2022-01-16.
- ↑ 3.0 3.1 Mohammad Shamsul Haq, Paimana-e-Ghazal, vol. 1, pg 241
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Muztar Khairabadi: Grand father of noted lyricist Jawed Akhtar". rekhta.org. Retrieved 2022-01-16.
- ↑ 5.0 5.1 "Muztar Khairabadi". Sher-o-Sukhan. Retrieved 2022-01-16.
ఇతర గ్రంథాలు
[మార్చు]- ఖలీల్ ఉల్లా ఖాన్, ముజ్తర్ ఖైరాబాదీ: హయత్ ఔర్ షైరీ (ఉర్దూ పబ్లిషర్స్, నజీర్ అబాద్, లక్నో, 1979).
- మహ్మద్ అబ్దుల్ షాహిద్ ఖాన్ షేర్వానీ, బాఘీ హిందుస్థాన్ (అల్మజ్మా అల్-ఇస్లామీ, ముబారక్‌పూర్, 1947).
- నష్టర్ ఖైరాబాది, ed., ఇల్హామాత్ (1934).