నీనా గుప్తా
నీనా గుప్తా | |
---|---|
జననం | ఇండియా | 1959 జూన్ 4
వృత్తి | నటి, దర్శకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం వరకు |
జీవిత భాగస్వామి | వివేక్ మెహ్రా (2008–ప్రస్తుతం వరకు) |
భాగస్వామి | వివియన్ రిచర్డ్స్ (?–1989) |
పిల్లలు | మసాబా గుప్తా |
నీనా గుప్తా (జననం 1959 జూన్ 4) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఈమె 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ది వీకెస్ట్ లింక్, కమ్‌జోర్ కడీ కౌన్ వంటి టి.వి.క్విజ్ ప్రోగ్రాములను నిర్వహించింది.[1]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఈమె ఢిల్లీలో జన్మించింది. తండ్రి పేరు ఆర్.ఎన్.గుప్తా. ఈమె ప్రాథమిక విద్య లారెన్స్ స్కూలులో చదివింది..[2]. ఈమె సంస్కృతంలో స్నాతకోత్తర పట్టాను పొందింది. అనంతరం ఎం.ఫిల్ కూడా సంపాదించుకుంది.
వృత్తి
[మార్చు]సినిమా రంగం
[మార్చు]ఈమె గాంధీ, ది డిసీవర్స్, మీర్జా గాలిబ్, ఇన్ కస్టడీ, కాటన్ మేరీ వంటి అంతర్జాతీయ సినిమాలలో నటించింది. గాంధీ సినిమాలో గాంధీ మేనకోడలి పాత్రను పోషించింది. ఈమె మాధురీ దీక్షిత్తో కలిసి ఖల్‌నాయక్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలోని ఛోళీకీ పీఛే క్యాహై అనే జనాకర్షకమైన పాటలో కనిపిస్తుంది. ఈమె లాజ్వంతి, బజార్ సీతారాం వంటి టెలీఫిల్ములను నిర్మించింది. బజార్ సీతారాం సినిమాకు 1993లో ఉత్తమ నాన్-ఫీచర్ విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
టెలివిజన్ రంగం
[మార్చు]ఈమె ఖాన్‌దాన్, మీర్జా గాలిబ్, భారత్ ఏక్ ఖోజ్, దర్ద్, గుమ్రాహ్, సాస్, సాత్ ఫెరె, చిట్టీ, మేరీ బీవీ కా జవాబ్ నహీ, కితనీ మొహబ్బత్ హై, సిస్కీ, జస్సీ జైసీ కోయీ నహీ, క్యూ హోతా హై ప్యార్, లేడీస్ స్పెషల్, దిల్ సే దియా వచన్, రిష్తే మొదలైన హిందీ టెలివిజన్ సీరియళ్లలో నటించింది. ఈమె నటుడు రాజేంద్ర గుప్తతో కలిసి సహజ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి కొన్ని సీరియళ్లను, నాటకాలను నిర్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె 1980లలో ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ను సంబంధం పెట్టుకుని మసాబ గుప్తా అనే కుమార్తెను కన్నది.[3] ఈమె అలోక్ నాథ్, సారంగ దేవ్‌లతో కూడా వివాహేతర సంబంధాలను కొనసాగించింది.[4] 2008లో ఢిల్లీలో స్థిరపడిన వివేక్ మెహ్రా అనే ఛార్టెడ్ అకౌంటెంట్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది.[5][6][7]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- యే నజ్దీకియా (1982)
- గాంధీ (1982)
- సాథ్ సాథ్ (1982)
- జానేభీ దో యారో (1983)
- మండీ (1983)
- ఉత్సవ్ (1984)
- త్రికాల్ (1985)
- దృష్టి (1990)
- సుస్మన్ (1987)
- రిహాయీ (1988)
- ది డిసీవర్స్ (1988)
- కారనామా (1990)
- స్వర్గ్ (1990)
- వాస్తుహార (1991) (మలయాళం)
- ఆదిమీమాంస (1991)
- మట్టి మనుషులు (1991) (తెలుగు)
- అహం (1992) (మలయాళం)
- జుల్మ్ కీ హుకూమత్ (1992)
- బల్‌వాన్ (1992)
- ఖల్‌నాయక్ (1993)
- సూరజ్‌కీ సాత్వా ఘోడా (1993)
- వీర్తా (1993)
- వో ఛోక్రీ (1994)
- నజర్ (1995)
- జస్బాత్ (1994)
- కాటన్ మేరీ (1999)
- అంబేద్కర్ (2000) - అంబేద్కర్ భార్య రమాబాయి
- తేరీ సంగ్ (2009)
- వీర్ (2010)
- నా ఘర్ నా ఘాట్‌కే (2010)
- ఛేవన్ దరియా (2010)
- గుడ్ బై (2022)
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | Ref. |
---|---|---|---|---|---|
1985 | ఖండాన్ | హిందీ | |||
1986 | యాత్ర | ||||
1987 | గుల్ గుల్షన్ గుల్ఫామ్ | ||||
1988 | మీర్జా గాలిబ్ | నవాబ్ జాన్ | |||
1989 | డార్డ్ | దర్శకుడు కూడా | |||
డాడీ | విమల | టెలివిజన్ చిత్రం | |||
చాణక్య | శ్వేత | ||||
1994 | జునూన్ | రీమా | |||
1994–1995 | దానే అనార్ కే | ||||
1998–1999 | సాన్స్ | ప్రియా కపూర్ | రచయిత మరియు దర్శకుడు కూడా | ||
1999 | పాల్ చిన్ | - | దర్శకుడు | ||
2000 | సిస్కీ | అనుష్క సక్సేనా | దర్శకుడు కూడా | ||
2000–2004 | సన్ ప్యారీ | - | నిర్మాత | ||
2001–2002 | కమ్జోర్ కడి కౌన్ | హోస్ట్ | |||
2002 | సాంఝీ | కనక్ | రచయిత కూడా | ||
2002–2004 | క్యున్ హోతా హై ప్యార్ర్ | - | నిర్మాత | ||
2004 | జస్సీ జైస్సీ కోయి నహీం | నందిని | |||
2005–2009 | సాత్ ఫేరే - సలోని కా సఫర్ | మనోరమ "మన్నో" నరేంద్ర సింగ్ | |||
2009 | లేడీస్ స్పెషల్ | శుభా జోషి | |||
2010–2011 | దిల్ సే దియా వచన్ | కళ్యాణి రాజాధ్యక్ష డా | |||
2018 | కెహ్నే కో హమ్సఫర్ హై | - | రచయిత | ||
2019 | మేడ్ ఇన్ హెవెన్ | వీను రోషన్ | అతిథి | ||
2020-ప్రస్తుతం | పంచాయితీ | మంజు దేవి | |||
2020 | పరివార్ | కాదంబరి | హాట్‌స్టార్ వెబ్ సిరీస్ | ||
2020-ప్రస్తుతం | మసబ మసబ | తనలాగే | నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ | ||
2023 | చార్లీ చోప్రా | జాంకి | SonyLIV వెబ్ సిరీస్ | ||
2024 | 1000 బేబీస్ | సారా ఔసేఫ్ | మలయాళం | హాట్‌స్టార్ వెబ్ సిరీస్ |
అవార్డులు
[మార్చు]- 1993: భారత జాతీయ చలనచిత్ర పురస్కారం నాన్ ఫీచర్ ఫిలిం : బజార్ సీతారాం
- 1994: భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి: వో ఛోక్రీ [8][9]
మూలాలు
[మార్చు]- ↑ Bold and dutiful Archived 2011-09-25 at the Wayback Machine MALA KUMAR, The Hindu, 16 December 2005.
- ↑ Nisheeth Sharan’s "Grillopollis" hosts Sanawar’s reunion over its first preview Archived 2013-10-24 at the Wayback Machine dated 23 October 2010 at glamgold.com, accessed 11 March 2012
- ↑ Tribune
- ↑ Neena Gupta Interview with Vir Sanghvi on her relationships
- ↑ DNA newspaper
- ↑ Neena Gupta thrilled with marriage, but says "Masaba is priority" Archived 2015-06-11 at the Wayback Machine Sify.com, IANS, 29 July 2008.
- ↑ Neena Gupta opens up... TANVI TRIVEDI , TNN, The Times of India, 22 November 2008.
- ↑ "41st National Film Awards". International Film Festival of India. Archived from the original on 13 మార్చి 2016. Retrieved 3 March 2012.
- ↑ "41st National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 3 March 2012.
బయటి లింకులు
[మార్చు][[వర్గం:భారతీయ మహిళా టెలివిజన్ దర్శకులు]]