దేవత (1941 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయోమయ నివృత్తి పేజీ దేవత చూడండి.

దేవత
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
నిర్మాణం మూలా నారాయణస్వామి,
బి.ఎన్.రెడ్డి
కథ కె.రామనాథ్
చిత్రానువాదం కె.రామనాథ్
తారాగణం చిత్తూరు నాగయ్య,
కుమారి,
బెజవాడ రాజారత్నం,
సుబ్బారావు,
సి.హెచ్.నారాయణరావు,
టంగుటూరి సూర్యకుమారి,
ముదిగొండ లింగమూర్తి,
మాస్టర్ అశ్వత్థామ
సంగీతం చిత్తూరు నాగయ్య
నేపథ్య గానం చిత్తూరు నాగయ్య,
బెజవాడ రాజరత్నం,
ఎమ్.ఎస్.రామారావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య,
కె.రామనాధ్
ఛాయాగ్రహణం కె.రామనాథ్
కళ ఎ. కె. శేఖర్
కూర్పు నారాయణన్
నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దేవత 1941 లో బి.యన్.రెడ్డి, వాహినీ పిక్చర్స్ పతాకంపై తీసిన మూడవ చిత్రం. సాహసోపేతమైన కథాంశంతో నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితాల నివ్వడంతో అదే 'దేవత' పేరుతో 1965లో పద్మనాభం, 1982లో రామానాయుడు చిత్రాల్ని నిర్మించారు.

చిత్ర కథ

[మార్చు]

ఇంగ్లండ్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని సొంతవూరు వస్తాడు వేణు (నాగయ్య). తల్లి మంగమ్మ (పార్వతీబాయి), చెల్లెలు సీత (సూర్యకుమారి) ఆనందానికి అవధులు లేవు. లక్ష్మి (కుమారి) వాళ్ళింట్లో పనిమనిషి. కానీ, ఇంట్లో వాళ్ళంతా ఆమెను సొంతమనిషిగానే చూస్తుంటారు. లక్ష్మి తమ్ముడు రంగడు (మాస్టర్ అశ్వద్దామ) కూడా ఆమెతోటే ఆ ఇంటిలో పనిచేస్తుంటాడు. మద్రాసులో వుంటున్న వేణు మేనమామ బలరామయ్య (సుబ్బారావు) కు అతన్ని తన అల్లుడిని చేసుకోవాలని ఆశ. అతనికి ఒక్కతే కూతురు. పేరు విమల (రాజరత్నం). ఆ పిల్లకు కవిత్వం, సంగీతాల పిచ్చి. సుకుమార్ (నారాయణరావు) అనే స్వార్థపరుడు ఆ ఇంటచేరి విమలనూ, ఆమె తండ్రినీ మెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కులహీనురాలయినా లక్ష్మి అందం వేణును వివశుడుని చేస్తుంటుంది. ఒక రోజు తల్లీ చెల్లెలు ఇంట్లో లేని వేళ బలవంతంగా ఆమెను అనుభవిస్తాడు. ఆవేశం చల్లారాక పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. నమ్ముతుంది లక్ష్మి. వేణు మద్రాసు వెళ్ళి బారిస్టరుగా ప్రాక్టీసు ఆరంభిస్తాడు. అతన్ని చూడడానికి తల్లీ చెల్లెలు కూడా వస్తారు. కూడా లక్ష్మి, ఆమె తమ్ముడు వస్తారు. లక్ష్మిని చూడగానే మళ్ళి వేణులో సంఘర్షణ మొదలవుతుంది. డబ్బిచ్చి ఆమెను వదిలించుకోచూస్తాడు. ఖిన్నురాలైన లక్ష్మి బాధతో తమ్ముడిని వెంటపెట్టుకుని పల్లెకు వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె గర్భవతి. తండ్రి వెంకయ్య (లింగమూర్తి) కి ఈ విషయం తెలిసి ఉగ్రుడవుతాడు. భయంతో తమ్ముడిని తీసుకుని లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అక్కడ వేణు మీద వైముఖ్యం పెంచుకున్న విమల ఓ రోజు సుకుమార్ తో లేచిపోతుంది. కళ్ళు తెరిచిన వేణు తల్లికి నిజం చెబుతాడు. లక్ష్మిని అన్వేషిస్తూ తిరుగుతుంటాడు. మద్రాసు చేరిన లక్ష్మి ఒక వ్యభిచార గృహంలో ఇరుక్కోబోయి తెలివిగా తప్పించుకుంటుంది. అయితే, బిడ్డకు ఆనారోగ్యం విషమించడంతో మళ్ళి ఆ ఇంటికే వెళ్ళి యజమానురాలిని డబ్బు సాయం అడుగుతుంది. ఇంతలో అంతరాత్మ ఎదురు తిరగడంతో వెళ్ళిపోబోతుంది. అడ్డుపడిన యజమానురాలి తల పగలగొడుతుంది. వ్యభిచార గృహం నిర్వాహకురాలు తన మరణవాంగ్మూలంలో లక్ష్మి తప్పేమీ లేదని, నిజానికి ఆమె దేవత అని పోలీసులకు చెబుతుంది. లక్ష్మి విడుదలవుతుంది. వేణు, లక్ష్మి ఒకటవుతారు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో 14 పాటలున్నాయి. వీటిని సముద్రాల రాఘవాచార్య రచించగా చిత్తూరు నాగయ్య సంగీతాన్ని అందించారు.[1]

పాట రచయిత సంగీతం గాయకులు
అదిగో అందియల రవళి సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య రాజరత్నం
ఎవరు మాకిక సాటి సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య రాజరత్నం
వెండి కంచాలలో సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య సూర్యకుమారి
క్రూర కర్మములు నేరక చేసితి సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య సూర్యకుమారి
ఎన్ని నోములు నోచినగాని ఈ నరజన్మము సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య జి. విశ్వేశరమ్మ
రామా భజనే మోదజనకము సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య టి. సూర్యకుమారి, జి. విశ్వేశరమ్మ బృందం
రావే రావే బంగరుపాప అడుతు సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య, టి. సూర్యకుమారి
వెండికంచాలలో వేడిబువ్వోందోయి సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య టి. సూర్యకుమారి
మగవారినిలా నమ్మరాదే చెలి సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య బెజవాడ రాజరత్నం
ఊగెదా ఉయ్యాల తూగుటుయ్యల సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య టి. సూర్యకుమారి
రత్నజనముల పండుగదినమిదిరా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య టి. సూర్యకుమారి
సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య
సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య
సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య

మూలాలు

[మార్చు]
  • పవర్ ఫుల్ టైటిల్ 'దేవత', నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీ 19-20.

వనరులు

[మార్చు]