త్రిశిర
Jump to navigation
Jump to search
త్రిశిర | |
---|---|
తోబుట్టువులు | అతికాయుడు నరాంతక దేవాంతక |
తండ్రి | రావణుడు |
తల్లి | ధాన్యమాలిని |
త్రిశిర (మూడు తలలు కలిగినవాడు) అనేది రామాయణ ఇతిహాసంలో ఒక పాత్ర, రాక్షసుడు. లంక రాజు రావణుని కుమారుడు.
జననం
[మార్చు]రావణుడు అతని రెండవ భార్య ధాన్యమాలినికి జన్మించాడు. ధ్యానమాలిని గురించిన ఖచ్చితమైన వివరాలు లేవు. కానీ కొన్ని కథలలో ధ్యానమాలిని మాయాసురుని కుమార్తెగా, మండోదరి సోదరిగా ప్రస్తావించబడింది. ఇతని సోదరులు అతికాయుడు, నరాంతక, దేవాంతక. [1]
రామాయణంలో
[మార్చు]రామాయణ యుద్ధంలో త్రిశిర పాల్గొని హనుమంతునిపై అనేక బాణాలు వేశాడని రామాయణం చెబుతుంది. ఈ సందర్భంగా హనుమంతుడు బాణాలు తన శరీరంపై కురిసిన పువ్వుల వంటిదని చెప్పాడు. ఆ తరువాత జరిగిన ద్వంద్వ యుద్ధం హనుమంతుడి చేతిలో త్రిశిర చంపబడ్డాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Mittal, J. P. (2006). History Of Ancient India (a New Version) : From 7300 Bb To 4250 Bc (in ఇంగ్లీష్). Atlantic Publishers & Dist. ISBN 978-81-269-0615-4.
- ↑ "BOOK VI: Canto LXX.: The Death of Tris'iras". www.sacred-texts.com. Retrieved 2022-11-05.