తూర్పు జర్మనీ
జర్మన్ ప్రజాస్వామ్య గణతంత్రం Deutsche Demokratische Republik (German) |
||||||
---|---|---|---|---|---|---|
Motto: "Proletarier aller Länder, vereinigt Euch!" | ||||||
Anthem: "Auferstanden aus Ruinen" ("శిథిలాల నుండి ఉత్థానం") |
||||||
Capital and largest city | తూర్పు బెర్లిన్[a] | |||||
Official languages | జర్మన్ సోర్బియన్ (డ్రెస్‌డెన్, కాట్‌బస్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో) |
|||||
Demonym |
|
|||||
Government | సమాఖ్య మార్క్సిస్టు-లెనినిస్టు ఏక-పార్టీ సామ్యవాద రిపబ్లిక్ (1949–1952) యూనిటరీ మార్క్సిస్టు-లెనినిస్టు ఏక-పార్టీ[1] socialist republic (1952–1989) Unitary multi-party parliamentary republic (1989–1990) Federal multi-party parliamentary republic (1990) |
|||||
Legislature | Volkskammer | |||||
Area | ||||||
- | Total | 1,08,875 km2 సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. sq mi |
||||
- | Density | 149/km2 385.9/sq mi |
||||
GDP (PPP) | 1989 estimate | |||||
- | Total | $525.29 billion[2] | ||||
- | Per capita | $26,631[2] | ||||
HDI (1990 సూత్రం) | 0.953[3] very high |
|||||
Currency |
|
|||||
Time zone | (UTC+1) | |||||
Drives on the | right | |||||
Calling code | +37 | |||||
Internet TLD | .dd[b][4] | |||||
The initial Flag of East Germany (GDR) adopted in 1949 was identical to that of West Germany (FRG). In 1959, government of this country issued a new version of the flag bearing the national emblem, serving to distinguish East from West. |
తూర్పు జర్మనీ మధ్య ఐరోపా లోని దేశం. దీన్ని అధికారికంగా జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (GDR) జర్మను భాషలో డ్యూష్ డెమోక్రాటిష్ రిపబ్లిక్ (DDR) అంటారు. ఇది 1949 అక్టోబరు 7 న ఏర్పడినప్పటి నుండి 1990 అక్టోబరు 3 న పశ్చిమ జర్మనీతో పునరేకీకరణ అయ్యే వరకు ఈ దేశం ఉనికిలో ఉంది. 1989 వరకు ఇది కమ్యూనిస్ట్ రాజ్యంగా ఉండేది. సోషలిస్ట్ "కార్మికుల, రైతుల రాజ్యం"గా వర్ణించబడింది.[5] దాన్ని స్థాపించడానికి ముందు, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సార్వభౌమాధికారాన్ని రద్దు చేసిన బెర్లిన్ డిక్లరేషన్ తర్వాత స్థానిక కమ్యూనిస్టుల స్వయంప్రతిపత్తితో ఈ భూభాగం సోవియట్ దళాల ఆక్రమణలో, పాలనలో ఉండేది; పోట్స్‌డామ్ ఒప్పందం ప్రకారం సోవియట్-ఆక్రమిత జోన్‌ను స్థాపించినప్పుడు, తూర్పున ఓడర్-నీస్సే రేఖ దానికి సరిహద్దుగా ఉండేది. GDR లో 1949 నుండి 1989 వరకు కమ్యూనిస్ట్ పార్టీ అయిన సోషలిస్ట్ యూనిటీ పార్టీ ఆఫ్ జర్మనీ (SED) ఆధిపత్యం చెలాయించింది. కమ్యూనిస్ట్ రాష్ట్రాలకు వ్యతిరేకంగా 1989 విప్లవాల ప్రభావంతో ప్రజాస్వామ్యం, సరళీకరణ జరిగి తూర్పు జర్మనీ పశ్చిమ దేశాలతో కలిసి పోయింది. పశ్చిమ జర్మనీ వలె కాకుండా SED, తమ దేశాన్ని జర్మన్ రైక్‌కు (1871-1945) వారస దేశంగా చూడలేదు. రాజ్యాంగంలో పునరేకీకరణ లక్ష్యాన్ని రద్దు చేసింది (1974). SED పాలించే GDR తరచుగా సోవియట్ ఉపగ్రహ రాజ్యంగా వర్ణించబడింది; పాశ్చాత్య పండితులు, విద్యావేత్తలు దీనిని నిరంకుశ పాలనగా అభివర్ణించారు.[6]
GDR ను సోవియట్-ఆక్రమిత జోన్‌లోని మాజీ నాజీ జర్మనీ (1933–1945)లో SED 1949 అక్టోబరు 7 న స్థాపించింది. అయితే ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ (FRG - దీన్ని పశ్చిమ జర్మనీ అంటారు) అంతకు ముందు మూడు పశ్చిమ US-UK-ఫ్రెంచ్ ఆక్రమిత జోన్‌లలో ఉదార ప్రజాస్వామ్య దేశంగా స్థాపించబడింది. ఇది సోవియట్ యూనియన్ యొక్క ఉపగ్రహ రాష్ట్రం.[7] సోవియట్ ఆక్రమణ అధికారులు 1948లో జర్మన్ కమ్యూనిస్ట్ నాయకులకు పరిపాలనా బాధ్యతలను బదిలీ చేయడం ప్రారంభించారు. GDR, 1955లో సోవియట్ యూనియన్ నుండి దాదాపు పూర్తి సార్వభౌమాధికారాన్ని పొంది, 1949 అక్టోబరు 7 నుండి స్వతంత్ర రాజ్యంగా పనిచేయడం ప్రారంభించింది. అయినప్పటికీ సోవియట్ యూనియన్ దేశంపై తన సైన్యాన్ని, గణనీయమైన రాజకీయ ప్రభావాన్నీ కొనసాగించింది. 1972లో, తూర్పు పశ్చిమ జర్మనీలు పరస్పరం గుర్తించుకున్నాయి. అలాగే ఈ రెండు జర్మన్ స్వతంత్ర దేశాలు కలిసి మరుసటి సంవత్సరం ఐక్యరాజ్యసమితిలో రెండు వేర్వేరు సభ్యదేశాలుగా మారాయి. 1989 వరకు GDR ను, సోవియట్-ఆక్రమిత జోన్‌లో 1946లో స్థాపించబడిన కమ్యూనిస్ట్ పార్టీ అయిన సోషలిస్ట్ యూనిటీ పార్టీ ఆఫ్ జర్మనీ పాలించింది; ఇతర పార్టీలు దాని కూటమి సంస్థ అయిన నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ది జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌లో పాల్గొన్నప్పటికీ వాటి ఉనికి నామమాత్రమే. SED, GDRలోని పాఠశాలల్లో మార్క్సిజం-లెనినిజం, రష్యన్ భాషల బోధనను తప్పనిసరి చేసింది.[8]
భౌగోళికంగా, GDR కు ఉత్తరాన బాల్టిక్ సముద్రం, తూర్పున పోలాండ్, ఆగ్నేయంలో చెకోస్లోవేకియా, నైరుతి పశ్చిమాల్లో పశ్చిమ జర్మనీలు సరిహద్దులుగా ఉండేవి. అంతర్గతంగా మిత్రరాజ్యాల ఆక్రమణ ప్రాంతం లోని సోవియట్ సెక్టార్ కూడా దీనికి సరిహద్దుగా ఉండేది. దీనిని తూర్పు బెర్లిన్ అని పిలుస్తారు. ఇదే దేశానికి రాజధానిగా కూడా ఉండేది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌ల ఆక్రమణ లోని వెస్ట్ బెర్లిన్ (FRG లోని భాగం) కూడా దీనికి సరిహద్దుగా ఉండేది. పాశ్చాత్య దేశాల ఆక్రమణలో ఉన్న మూడు రంగాలను 1961 లో బెర్లిన్ గోడ ద్వారా GDR మూసివేసింది. తూర్పు జర్మనీకి వ్యతిరేకంగా శాంతియుత విప్లవంలో భాగంగా 1989 లో వీటిని తెరిచారు.
తూర్పు బెర్లిన్‌లోని రాజకీయ అధికార కేంద్రం - పశ్చిమంలో - పాంకోవ్ (జర్మనీలోని సోవియట్ దళాల కమాండ్ సీటు బెర్లిన్ తూర్పున ఉన్న కార్ల్‌షోర్స్ట్‌లో ఉంది.).[9] అయితే, కాలక్రమేణా, "DDR" అనే సంక్షిప్త పదాన్ని పశ్చిమ జర్మన్లు, పశ్చిమ జర్మన్ మీడియా కూడా వాడుకలో ఎక్కువగా ఉపయోగించింది. [c]
పశ్చిమ జర్మన్ల వాడుకలో, వెస్ట్‌డ్యూష్‌ల్యాండ్ (పశ్చిమ జర్మనీ) అనే పదం అంటే దాదాపు ఎల్లప్పుడూ పశ్చిమ జర్మనీ భౌగోళిక ప్రాంతాన్ని సూచించే పదమే. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ సరిహద్దుల్లోపల ఉన్న ప్రాంతానికి సంబంధించినది కాదు. అయితే, ఈ ఉపయోగం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. వెస్ట్‌డ్యూచ్‌ల్యాండ్ అనే పదాన్ని వెస్ట్ బెర్లిన్ వాసులు ఫెడరల్ రిపబ్లిక్‌ను సూచించడానికి తరచుగా ఉపయోగించేవారు.[10] రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, ఈస్ట్‌డ్యూష్‌ల్యాండ్ (తూర్పు జర్మనీ) ఎల్బే (తూర్పు ఎల్బియా)కి తూర్పున ఉన్న అన్ని భూభాగాలను వివరించడానికి ఉపయోగించబడింది. ఇది సామాజిక శాస్త్రవేత్త మాక్స్ వెబర్, రాజకీయ సిద్ధాంతకర్త కార్ల్ ష్మిట్ రచనలలో ప్రతిబింబిస్తుంది.[11][12][13][14]
చరిత్ర
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యాల్టా కాన్ఫరెన్స్‌లో, మిత్రరాజ్యాలైన యునైటెడ్ స్టేట్స్ (US), యునైటెడ్ కింగ్‌డమ్ (UK), సోవియట్ యూనియన్ (USSR) లు ఓడిపోయిన నాజీ జర్మనీని ఆక్రమణ ప్రాంతాలుగా విభజించడానికి పరస్పరం అంగీకరించాయి.[15] జర్మనీ రాజధాని బెర్లిన్‌ను కూడా మిత్రరాజ్యాల మధ్య విభజించడానికి కూడా ఒప్పందం కుదిరింది. అంటే ఆక్రమణ ప్రాంతాన్ని మూడు మండలాలు, అంటే అమెరికన్, బ్రిటిష్, సోవియట్ గా పంచుకుంటారు. అ తరువాత, US, బ్రిటిష్ జోన్ల నుండి కొంత ప్రాంతాన్ని విడదీసి ఒక ఫ్రెంచ్ జోన్‌ను ఏర్పరచారు.
1945-1949 మధ్య పశ్చిమ జర్మనీ దాని ఆక్రమణదారుల నుండి స్వాతంత్ర్యం పొంది, ఒక దేశంగా అవతరించింది. GDR 1949 అక్టోబరులో తూర్పు జర్మనీలో స్థాపించబడింది. రెండు సార్వభౌమ రాజ్యాల ఆవిర్భావంతో 1945 నాటి జర్మనీ విభజన రూపుదాల్చింది.[16] 1952 మార్చి 10 న సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ జోసెఫ్ స్టాలిన్, ఆర్థికపరమైన షరతులు లేకుండా, తటస్థ విధానంతో జర్మనీని పునరేకీకరించే ప్రతిపాదనను విడుదల చేశాడు. విధానాలు, "వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, మతపరమైన ఒప్పందాలు, రాజకీయ విశ్వాసం, సమావేశాలు" ప్రజాస్వామ్య పార్టీలు, సంస్థల స్వేచ్ఛా కార్యకలాపాలతో సహా మానవ హక్కులు ప్రాథమిక స్వేచ్ఛల కోసం హామీలు ఇవ్వడం ఆ ప్రతిపాదనలో ఉంది.[17] పశ్చిమ దేశాలు దీన్ని ప్రశ్నించాయి; పునరేకీకరణ అనేది పశ్చిమ జర్మనీ నాయకత్వానికి ప్రాధాన్యత కాదు. NATO శక్తులు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. జర్మనీ NATO లో చేరవచ్చని, సోవియట్ యూనియన్‌తో అటువంటి చర్చలు జరపడమంటే లొంగిపోవడమేనని నొక్కిచెప్పాయి.
1949లో సోవియట్‌లు తూర్పు జర్మనీపై నియంత్రణను SED కి ఇచ్చారు, విల్‌హెల్మ్ పీక్ (1876-1960) GDR అధ్యక్షుడయ్యాడు. మరణించే వరకు అతను ఆ పదవిలో ఉన్నాడు. అయితే SED ప్రధాన కార్యదర్శి వాల్టర్ ఉల్‌బ్రిచ్ట్ కార్యనిర్వాహక అధికారాన్ని చేపట్టాడు. సోషలిస్ట్ నాయకుడు ఒట్టో గ్రోటెవోల్ (1894-1964) ఆమరణాంతం ప్రధానమంత్రిగా.ఉన్నాడు [18]
డై వెండే (జర్మన్ పునరేకీకరణ)
[మార్చు]1989 మేలో, స్థానిక ప్రభుత్వ ఎన్నికల ఫలితాలలో మోసాలు, కుట్రలూ చేయడంపై ప్రజలలో విస్తృతమైన కోపం వచ్చింది. ఆ తరువాత, చాలా మంది GDR పౌరులు నిష్క్రమణ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు లేదా GDR చట్టాలకు విరుద్ధంగా దేశం విడిచిపెట్టారు. 1989 మే 2 న ఆస్ట్రియాతో హంగేరి సరిహద్దులో ఉన్న విద్యుద్దీకరించబడిన కంచెను తొలగించడం తూర్పు జర్మన్ల ఈ వలసకు ప్రేరణ. అధికారికంగా హంగేరియన్ సరిహద్దు ఇంకా మూసే ఉన్నప్పటికీ, చాలా మంది తూర్పు జర్మన్లు చెకోస్లోవేకియా మీదుగా హంగేరీలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆపై హంగరీ నుండి ఆస్ట్రియాకు, పశ్చిమ జర్మనీకి అక్రమంగా దాటారు.[19] జూలై నాటికి, 25,000 మంది తూర్పు జర్మన్లు హంగరీలోకి ప్రవేశించారు;[20] వారిలో ఎక్కువ మంది ఆస్ట్రియా లోకి వెళ్ళే ప్రమాదకర మార్గాన్ని దాటడానికి ప్రయత్నించకుండా, హంగేరీలోనే ఉండిపోయారు. లేదా ప్రాగ్ లేదా బుడాపెస్ట్‌లోని పశ్చిమ జర్మన్ రాయబార కార్యాలయాలలో ఆశ్రయం పొందారు.
1989 ఆగస్టు 19 న పాన్-యూరోపియన్ పిక్నిక్‌లో ఆస్ట్రియా, హంగరీల మధ్య సరిహద్దు ద్వారం తెరవడంతో GDR ముగింపుకు, ఈస్టర్న్ బ్లాక్ విచ్ఛిన్నానికీ దారితీసిన చైన్ రియాక్షను మొదలైంది. 1961లో బెర్లిన్ గోడను కట్టిన తర్వాత తూర్పు జర్మనీ నుండి సామూహికంగా తప్పించుకోవడంలో ఇదే అతి పెద్దది. ఒక వేడుకలో సరిహద్దును తెరవాలనే ఆలోచన ఒట్టో వాన్ హబ్స్‌బర్గ్ ఇచ్చాడు. అతను ఈ ఆలోచనను హంగేరియన్ ప్రధాన మంత్రి మిక్లోస్ నెమెత్‌కు ప్రతిపాదించగా అతను దాన్ని బలపరచాడు.[21] ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తున్న హబ్స్‌బర్గ్, హంగేరియన్ రాష్ట్ర మంత్రి ఇమ్రే పోజ్‌గే లు, ఇనుప తెరపై సరిహద్దును తెరిస్తే మిఖాయిల్ గోర్బచెవ్ ఎలా స్పందిస్తాడో తెలుసుకోడానికి ఇది ఒక అవకాశంగా భావించారు. ప్రత్యేకించి, హంగరీలో ఉన్న సోవియట్ దళాలకు జోక్యం చేసుకోవాలని ఆదేశాన్ని ఇస్తుందో లేదో పరీక్షించదలచారు. పిక్నిక్ గురించి విస్తృతంగా ప్రచారం చేసారు. పాన్‌యూరోపియన్ యూనియన్ ఆస్ట్రియా శాఖ, సోప్రాన్ (హంగేరీ సరిహద్దు ఆస్ట్రియాకు సమీపంలో) సరిహద్దు సమీపంలో పిక్నిక్‌కి ఆహ్వానిస్తూ GDR పౌరులకు వేలాది బ్రోచర్‌లను పంపిణీ చేసింది.[22][23][24] స్థానిక సోప్రాన్ నిర్వాహకులకు GDR శరణార్థుల గురించి ఏమీ తెలియదు. ఆస్ట్రియన్, హంగేరియన్లు కలిసి పార్టీ చేసుకుంటారని వాళ్ళు అనుకున్నారు.[25] కానీ పాన్-యూరోపియన్ పిక్నిక్ వద్ద సామూహిక వలసలు జరగడం, దాని పట్ల తూర్పు జర్మనీ లోని సోషలిస్ట్ యూనిటీ పార్టీ వెనకాముందు లాడడం, సోవియట్ యూనియన్ జోక్యం చేసుకోకపోవడం ఇవన్నీ చూసి వలసలకు కట్టలు తెగిపోయాయి. ఆ విధంగా ఈస్టర్న్ బ్లాక్ అడ్డంకి బద్దలైంది. మీడియా ద్వారా అప్రమత్తమైన పదివేల మంది తూర్పు జర్మన్లు హంగరీకి చేరుకున్నారు. తన సరిహద్దులను పూర్తిగా మూసివేయడానికి గాని, తప్పించుకునే వారిపై కాల్పులు జరపడానికి గానీ హంగరీ సిద్ధపడలేదు. తూర్పు బెర్లిన్‌లోని GDR నాయకత్వం కూడా తమ దేశ సరిహద్దులను పూర్తిగా లాక్ చేయడానికి ధైర్యం చేయలేదు.[22][24][26][27]
1989 నవంబరు 9 న, బెర్లిన్ గోడలోని కొన్ని విభాగాలను తెరిచారు. ఫలితంగా వేలాది మంది తూర్పు జర్మన్లు దాదాపు 30 సంవత్సరాల తరువాత మొదటిసారి పశ్చిమ బెర్లిన్ లోకి, పశ్చిమ జర్మనీ లోకీ స్వేచ్ఛగా ప్రవేశించారు. క్రెంజ్ ఒక నెల తర్వాత రాజీనామా చేశాడు. స్వేచ్ఛాయుత ఎన్నికలను షెడ్యూల్ చేయడానికి, ప్రజాస్వామ్యీకరణ ప్రక్రియను ప్రారంభించడానికీ న్యూస్ ఫోరమ్ నాయకులతో SED చర్చలు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా, తూర్పు జర్మన్ రాజ్యాంగంలో కమ్యూనిస్టులకు తప్పనిసరిగా అధికారం ఇచ్చే హామీని SED తొలగించింది. 1989 డిసెంబరు 1 న పార్లమెంటులో ఈ మార్పు 420-0 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.[28]
తూర్పు జర్మనీ తన చివరి ఎన్నికలను 1990 మార్చిలో నిర్వహించింది. గెలుపొందినది అలయన్స్ ఫర్ జర్మనీ. ఇది పశ్చిమ జర్మనీ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ యొక్క తూర్పు జర్మన్ శాఖ నేతృత్వంలోని సంకీర్ణం. రెండు జర్మన్ దేశాలు, మాజీ మిత్రదేశాలు పాల్గొన్న చర్చలు ( 2+4 చర్చలు) జరిగాయి. ఇది జర్మన్ ఏకీకరణకు సంబంధించిన షరతులపై ఒప్పందానికి దారితీసింది. పార్లమెంటులో మూడింట రెండు వంతుల ఓట్లతో 1990 ఆగస్టు 23 న, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో తన విలీనాన్ని ప్రకటించింది. 1952 పునర్విభజనలో రద్దు చేయబడిన ఐదు అసలైన తూర్పు జర్మన్ రాష్ట్రాలను పునరుద్ధరించారు.[29] 1990 అక్టోబరు 3 న ఐదు రాష్ట్రాలు అధికారికంగా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో చేరాయి, అయితే తూర్పు, పశ్చిమ బెర్లిన్‌లు ఏకమై మూడవ నగర-రాష్ట్రంగా ( బ్రెమెన్, హాంబర్గ్ ల మాదిరిగానే) ఏర్పడ్డాయి. జూలై 1న, రాజకీయ యూనియన్‌కు ముందు కరెన్సీ యూనియన్ ఏర్పడింది: "ఓస్ట్‌మార్క్"ను రద్దు చేసి, పశ్చిమ జర్మన్ "డ్యుయిష్ మార్క్"ను సాధారణ కరెన్సీగా స్వీకరించారు.
గమనికలు
[మార్చు]- ↑ Partially recognised
- ↑ Although .dd was reserved as corresponding ISO code for East Germany, it was not entered to the root before the country was reunited with the west.
- ↑ The use of the abbreviation BRD (FRG) for West Germany, the Bundesrepublik Deutschland (Federal Republic of Germany), on the other hand, was never accepted in West Germany since it was considered a political statement. Thus BRD (FRG) was a term used by East Germans, or by West Germans who held a pro-East-German view. Colloquially, West Germans called West Germany simply Germany (reflecting West Germany's claim to represent the whole of Germany), or alternatively the Bundesrepublik or Bundesgebiet (Federal Republic or Federal Territory, respectively), referring to the country and Bundesbürger (Federal citizen) for its citizens, with the adjective bundesdeutsch (Federal German).
మూలాలు
[మార్చు]- ↑ Frank B. Tipton (1 January 2003). "East Germany: The structure and functioning of a one-party state". A History of Modern Germany Since 1815. A&C Black. pp. 545–548. ISBN 978-0-8264-4909-2.
- ↑ 2.0 2.1 "GDR". World Inequality Database.
- ↑ "Human Development Report 1990" (PDF). hdr.undp.org. January 1990. Archived (PDF) from the original on 2 February 2014.
- ↑ "Top-Level-Domain .DD" (in జర్మన్). Archived from the original on 4 November 2015.
- ↑ Major, Patrick; Osmond, Jonathan (2002). The Workers' and Peasants' State: Communism and Society in East Germany Under Ulbricht 1945–71. Manchester University Press. ISBN 978-0-7190-6289-6.
- ↑ Kocka, Jürgen, ed. (2010). Civil Society & Dictatorship in Modern German History. UPNE. p. 37. ISBN 978-1-58465-866-5. Archived from the original on 20 March 2015. Retrieved 14 October 2015.
- ↑ Karl Dietrich Erdmann, Jürgen Kocka, Wolfgang J. Mommsen, Agnes Blänsdorf. Towards a Global Community of Historians: the International Historical Congresses and the International Committee of Historical Sciences 1898–2000. Berghahn Books, 2005, p. 314. ("However the collapse of the Soviet empire, associated with the disintegration of the Soviet satellite regimes in East-Central Europe, including the German Democratic Republic, brought about a dramatic change of agenda.")
- ↑ Grix, Jonathan; Cooke, Paul (2003). East German Distinctiveness in a Unified Germany. A&C Black. p. 17. ISBN 978-1-902459-17-2.
- ↑ Berlin Korrespondent (June 1949). "Nationale Front in der Ostzone" [National Front in the Eastern Zone]. Die Zeit (in జర్మన్). Archived from the original on 11 November 2013. Retrieved 10 May 2013.
- ↑ Wildenthal, Lora. The Language of Human Rights in West Germany. p. 210.
- ↑ Cornfield, Daniel B.; Hodson, Randy (2002). Worlds of Work: Building an International Sociology of Work. Springer. pp. 223. ISBN 0-306-46605-8.
- ↑ Baranowski, Shelley (6 April 1995). The Sanctity of Rural Life: Nobility, Protestantism, and Nazism in Weimar Prussia. Oxford University Press. pp. 187–188. ISBN 978-0-19-536166-7. Archived from the original on 1 December 2019. Retrieved 16 November 2019.
- ↑ Schmitt, Carl (12 July 2017). Political Romanticism. Routledge. p. 11. ISBN 978-1-351-49869-2. Archived from the original on 23 December 2019. Retrieved 16 November 2019.
- ↑ "Each spring, millions of workmen from all parts of western Russia arrived in eastern Germany, which, in political language, is called East Elbia." from The Stronghold of Junkerdom, by George Sylvester Viereck. Viereck's, Volume 8. Fatherland Corporation, 1918.
- ↑ "Yalta Conference". spartacus.schoolnet.co.uk. Archived from the original on 14 May 2011. Retrieved 25 September 2010.
- ↑ See Anna M. Cienciala "History 557 Lecture Notes" Archived 20 జూన్ 2010 at the Wayback Machine
- ↑ Steininger, Rolf (1990). The German Question: The Stalin Note of 1952 and the Problem of Reunification. New York, NY: Columbia University Press.
- ↑ Roth, Gary. "Review of Hoffmann, Dierk, _Otto Grotewohl (1894–1964): Eine politische Biographie_" H-German, H-Net Reviews. November 2010. online Archived 17 అక్టోబరు 2012 at the Wayback Machine
- ↑ Judt 2005
- ↑ "The Berlin Wall (1961–89)". German Notes. Archived from the original on 19 April 2005. Retrieved 24 October 2006.
- ↑ Miklós Németh in Interview, Austrian TV – ORF "Report", 25 June 2019.
- ↑ 22.0 22.1 Szabo, Hilde (16 August 1999). "Die Berliner Mauer begann im Burgenland zu bröckeln" [The Berlin Wall began to crumble in Burgenland]. Wiener Zeitung (in జర్మన్).
- ↑ Lahodynsky, Otmar (9 August 2014). "Paneuropäisches Picknick: Die Generalprobe für den Mauerfall" [Pan-European picnic: the dress rehearsal for the fall of the Berlin Wall]. Profil (in జర్మన్).
- ↑ 24.0 24.1 Greven, Ludwig (19 August 2014). "Und dann ging das Tor auf" [And then the Gate Opened]. Die Zeit.
- ↑ Lahodynsky, Otmar (13 June 2019). "Eiserner Vorhang: Picknick an der Grenze" [Iron curtain: picnic at the border]. Profil (in జర్మన్).
- ↑ Roser, Thomas (17 August 2018). "DDR-Massenflucht: Ein Picknick hebt die Welt aus den Angeln" [Mass exodus of the GDR: A picnic clears the world]. Die Presse (in జర్మన్).
- ↑ Frank, Michael (17 May 2010). "Paneuropäisches Picknick – Mit dem Picknickkorb in die Freiheit" [Pan-European picnic – With the picnic basket to freedom]. Süddeutsche Zeitung (in జర్మన్).
- ↑ Judt 2005, p. 615.
- ↑ Sarotte, Mary Elise (2014). Collapse: The Accidental Opening of the Berlin Wall. New York: Basic Books.