కైలాస్ నాథ్ వాంచూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైలాస్ నాథ్ వాంచూ
10వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1967 ఏప్రిల్ 12 – 1968 ఫిబ్రవరి 24
Appointed byసర్వేపల్లి రాధాకృష్ణన్
అంతకు ముందు వారుకోకా సుబ్బారావు
తరువాత వారుమహమ్మద్ హిదయతుల్లా
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అంతకు ముందు వారుప్రకాష్ చంద్ర తాటియా
డి.ఎన్. పటేల్
వ్యక్తిగత వివరాలు
జననం(1903-02-25)1903 ఫిబ్రవరి 25
అలహాబాదు, ఉత్తర ప్రదేశ్
మరణం1988 (aged 84–85)

కైలాస్ నాథ్ వాంచూ (1903, ఫిబ్రవరి 25 - 1988) భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి.[1] 1926 డిసెంబరు 1న ఉత్తర ప్రదేశ్‌లో జాయింట్ మేజిస్ట్రేట్‌గా ఇండియన్ సివిల్ సర్వీస్‌లో చేరాడు. 1967 ఏప్రిల్ 12 నుండి 1968 ఫిబ్రవరి 24న పదవీ విరమణ చేసేవరకు భారత ప్రధాన న్యాయమూర్తి పనిచేశాడు.[2]

జననం, విద్య

[మార్చు]

కైలాస్ నాథ్ వాంచూ 1903 ఫిబ్రవరి 25న మధ్యప్రదేశ్ రాష్ట్రం మాంద్‌సౌర్‌లోని జన్మించాడు. నౌగాంగ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత కాన్పూర్‌లోని పండిట్ పిర్థి నాథ్ హైస్కూల్, అలహాబాదులోని ముయిర్ సెంట్రల్ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్‌ వధమ్ కళాశాలలో చదువుకున్నాడు. 1924లో ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, రెండేళ్ళ శిక్షణను పూర్తిచేయడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్ళాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1926లో భారతదేశానికి తిరిగి వచ్చి, మొదట యునైటెడ్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ మేజిస్ట్రేట్, కలెక్టర్‌గా నియమించబడ్డాడు. దశాబ్దకాలంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. 1937 నాటికి యునైటెడ్ ప్రావిన్సెస్‌లో సెషన్స్, డిస్ట్రిక్ట్ జడ్జిగా పదోన్నతి పొందాడు. 1947లో అలహాబాద్ హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.

1951 జనవరి 2న పార్ట్ బి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత, 1956 నవంబరు 1న రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. 1958 ఆగస్టు 11న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితుడయ్యే వరకు ఈ పదవిలో కొనసాగాడు.

పది సంవత్సరాల తరువాత, భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 1967 ఏప్రిల్ 11న అప్పటి సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి కోకా సుబ్బారావు ఆకస్మిక రాజీనామా చేసిన తర్వాత, వాంచూ 1967 ఏప్రిల్ 24న ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. కేవలం పది నెలలు మాత్రమే ఆ పదవిలో పనిచేసి 1968 ఫిబ్రవరి 24న పదవీ విరమణ పొందాడు.[3] సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, వాంచూ 355 తీర్పులు ఇచ్చాడు. 1,286 బెంచ్‌లలో కూర్చున్నాడు.

నిర్వర్తించిన హోదాలు

[మార్చు]
  • అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి (1947 ఫిబ్రవరి-1951 జనవరి)
  • రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (1951-58)
  • ఉత్తర ప్రదేశ్ న్యాయ సంస్కరణల కమిటీ చైర్మన్ (1950–51)
  • ఇండోర్ ఫైరింగ్ ఎంక్వైరీ కమిషన్ ఏకైక సభ్యుడు (1954)
  • ధోల్పూర్ వారసత్వ కేసు కమిషన్ చైర్మన్ (1955)
  • లా కమిషన్ సభ్యుడు (1955)
  • భారత ప్రధాన న్యాయమూర్తి (1967 ఏప్రిల్ 12 - 1968 ఫిబ్రవరి 24) [4]

మరణం

[మార్చు]

కైలాస్ నాథ్ వాంచూ 1988లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. priyanka (2022-08-18). "List of Chief Justice in India (1950-2021)". adda247 (in Indian English). Retrieved 2022-10-25.
  2. "K.N. Wanchoo". Supreme Court Observer. Archived from the original on 2022-05-18. Retrieved 2022-10-25.
  3. S.H, Patil. The Constitution, Government and Politics in India (in ఇంగ్లీష్). Vikas Publishing House. ISBN 978-93-259-9411-9.
  4. Bhardwaj, A. P. (2018-01-01). Legal Awareness and Legal Reasoning : For CLAT and Other Law Entrance Examinations, Celebrating 10 Successful years in guiding aspirants to crack CLAT and other premier LLB examinations (in ఇంగ్లీష్). Pearson Education India. ISBN 978-93-5306-111-1.

ఇతర లంకెలు

[మార్చు]