ఏడ్రియన్ మరీ లెజాండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Adrien-Marie Legendre
1820 watercolor caricature of Adrien-Marie Legendre by French artist Julien-Leopold Boilly (see portrait debacle), the only existing portrait known[1]
జననం(1752-09-18)1752 సెప్టెంబరు 18
Paris, France
మరణం1833 జనవరి 10(1833-01-10) (వయసు 80)
Paris, France
నివాసంFrance
జాతీయతFrench
రంగములుMathematician
వృత్తిసంస్థలుÉcole Militaire
చదువుకున్న సంస్థలుCollège Mazarin
ప్రసిద్ధిLegendre transformation and elliptic functions

ఏడ్రియన్ మరీ లెజాండర్ (సెప్టెంబర్ 18, 1752జనవరి 10, 1833) ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. గణాంక శాస్త్రము (statistics), సంఖ్యావాదము (number theory) మొదలైన విభాగాలలో విశేష కృషి చేశాడు. చంద్రుడి పై ఉన్న 'లెజాండర్ క్రేటర్' పేరు ఈయన జ్ఞాపకార్థం పెట్టేరు.

జీవితం

[మార్చు]

లెజాండర్ ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ప్యారిస్లో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించాడు. తరువాత ఒక మిలిటరీ అకాడమీలో బోధకుడిగా చేరాడు. ఇది కేవలం ఆయన ఆసక్తి కోసమే తప్ప డబ్బు కోసం కాదు. ఆయన మొట్టమొదట పనిచేసింది ప్రాక్షేపిక శాస్త్రం లో; అనగా, రివ్వున విసరిన వస్తువుల స్థితిగతులని అధ్యయనం చేసే శాస్త్రం. దీనినే ఇంగ్లీషులో బాలిస్టిక్స్ అంటారు. తరువాత గణిత శాస్త్రం వైపు దృష్టి సారించాడు. 1782లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఫ్రెంచి విప్లవం సమయంలో లెజాండర్ తన ధనాన్నంతా పోగొట్టుకున్నాడు. ఆయన రాసిన Éléments de Géంmétrie అనే పుస్తకం బాగా పేరొందింది. చాలా భాషల్లోకి తర్జుమా చేయబడింది. కానీ ఆయన్ను తగిన జీవన ప్రమాణంలో జీవించేలా చేసింది మాత్రం బోధన సదుపాయం, పెన్షన్ మాత్రమే. కాని 1824 లో కార్యాలయ రాజకీయాల్లో చిన్న పొరపాటు జరిగి పెన్షన్ కూడా ఆగిపోయింది. దాంతో ఆయన అప్పటి నుంచీ పేదరికంలోనే బతికాడు.

శాస్త్రీయ పరిశోధనలు

[మార్చు]

ఈయన చేసిన చాలా పరిశోధనలు ఇతర శాస్త్రవేత్తలు మెరుగు పరచి వాడుకలోకి తీసుకుని వచ్చారు. ఈయన పేరు మీదుగా ఎక్కువ ప్రచారంలో ఉన్న అంశాలు: లెజాండర్‌ బహుపదులు, కనిష్ఠ వర్గాల పద్ధతి (method of least squares) - ఈ రెండూ ఇప్పుడు అపకర్షకం (regression), వాకేత సంవిధానం (signal processing), మొదలైన రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి.

  • గామా ప్రమేయానికి Γ అనే గ్రీకు అక్షరాన్ని వాడమని సలహా ఇచ్చినది ఈయనే!
  • ఫెర్మా ఆఖరి సిద్దాంతాన్ని n = 5 అయిన సందర్భంలో రుజువు చేసేరు. .
  • ప్రధాన సంఖ్యల పరిధిలో ఈయన చాల కృషి చేసి కొత్త ఫలితాలు కనుక్కున్నారు.
  • ఎలిప్టిక్‌ ప్రమేయాల రంగంలో కూడా ఈయన కొత్త పుంతలు తొక్కి మంచి ఫలితాలు సాధించేడు.

మూలాలు

[మార్చు]
  1. Duren, Peter (2009). "Changing Faces: The Mistaken Portrait of Legendre" (PDF). Notices of the AMS. 56 (11): 1440–1443, 1455.