యయాతి

వికీపీడియా నుండి
08:27, 29 ఆగస్టు 2022 నాటి కూర్పు. రచయిత: Chaduvari (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search

వివాహం

[మార్చు]
దస్త్రం:Sharmista was questined by Devavayani.jpg
దేవయాని శర్మిష్టను ప్రశ్నించుట

వృషపర్వుడనే వాడు దానవులకు రాజు. ఆయన కుమార్తె శర్మిష్ట. శుక్రాచార్యుని కూతురు దేవయాని. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు కనుక వీరిద్దరూ ప్రాణ మిత్రులయ్యారు. ఒక నాడు వారిరువురూ నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా వాళ్ళను అనుసరించిన దేవేంద్రుడు వారి దుస్తులను మార్చి వేస్తాడు. ముందుగా స్నానం ముగించుకుని వచ్చిన శర్మిష్ట జరిగిన సంగతి తెలియక దేవయాని దుస్తులను ధరిస్తుంది. దాన్ని చూసిన దేవయాని కోపోద్రిక్తురాలవుతుంది. మా తండ్రి మీ తండ్రికి గురువు కనుక, నీవు నాకంటే తక్కువ స్థాయి గలదానివి. నా బట్టలు ఎలా ధరిస్తావు? అని ప్రశ్నించింది. అది విన్న శర్మిష్ట కూడా అంతే కోపంతో నా తండ్రి ఈ రాజ్యానికి ప్రభువు. నీ తండ్రే నా తండ్రి కింద పని చేస్తున్నాడు కాబట్టి నువ్వే నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నావంటుంది. అలా జరిగిన జగడంలో శర్మిష్ట దేవయానిని ఒక బావిలో పడదోసి వెళ్ళి పోతుంది.

భార్యా పిల్లలు

[మార్చు]

ఇతనికి ఇద్దరు భార్యలు, దేవయాని, శర్మిష్ఠ. దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యుని కుతురు. శర్మిష్ఠ రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె. యయాతికి శర్మిష్ట యందు పూరుడును, దేవయాని యందు యదువు, తుర్వసుడు జన్మించిరి.

అనువు

[మార్చు]

యయాతి కుమారుడు, శర్మిష్ఠకు జన్మించినవాడు. తండ్రి ముసలితనము గైకొనుటకు అనువు ఒప్పుకొనలేదు. ఈ కారణమున నతని రాజ్యాధికారము పోయెను. తరువాత నతడు మ్లేచ్ఛ రాజ్యమున కథిపతి యయ్యెను. ఇతని కుమారులు చక్షు, సభానరులు. క్రధవంశమునకు జెందిన కపోతరోముని కుమారుడు. అనువు కుమారుడు అంధకుడు.

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=యయాతి&oldid=3638185" నుండి వెలికితీశారు