ఫ్రీడమ్ అఫ్ పనోరమ
ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ అనేది వివిధ దేశాలలోని నకలు హక్కుల చట్టాలలో సడలింపు ద్వారా నకలు హక్కులు గల జనసామాన్య భవనాలు, విగ్రహాలు, చిత్రపటాల బొమ్మలు తీయడాన్ని, వీడియోలో పొందుపరచడాన్ని అనుమతించే వెసులుబాటు.[1][2] నకలు హక్కుల (కాపీరైట్) నియమాల ప్రకారం ఒక సృజనాత్మక రచనని ఆ రచన హక్కుదారు అనుమతి లేనిదే వివిధ రూపాల్లో నకలు చేసుకోవడం చట్టప్రకారం నేరం. ఐరోపా లోని దేశాల సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీవిధ దేశాలలో జాతీయ భవంతుల నకలు హక్కులు ఆయా దేశ ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. ఆ భవంతుల చిత్రాలు లేదా వీడియోలు తీయడం లాంటివి నకలు హక్కుల ఉల్లంఘన కింద పరిగణించ బడతాయి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ వెసులుబాటు ప్రకారం ధన లాభాపేక్ష లేని జ్ఞానార్జనకు ఉపయోగపడే అంశాలలో ఆ భవంతుల చిత్రాలను లేదా వీడియోలను చట్టబద్ధంగా వాడుకోవచ్చు. ఈ పదం జెర్మన్ పదం Panoramafreiheit (పనోరమఫ్రైహైట్ - ఫ్రీడమ్ అఫ్ పనోరమ - పనోరమ స్వాతంత్ర్యం) నుండి ఏర్పడింది.
ప్రపంచ వ్యాప్త చట్టాలు
మార్చుప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఈ వెసులుబాటు కల్పించబడింది, అయితే ఎన్నో దేశాలలో నకలు హక్కుల ప్రకారం జాతీయ భవంతుల చిత్రాలు తీయడం నేరం. ఉదాహరణకు ఐఫిల్ టవ్ర్ ను రారి పూటల పలు రంగుల వెలుతురులలో ఫోటో తీయటం చట్టప్రకారం నేరం.
భారతదేశంలో వెసులుబాటు
మార్చుభారతదేశంలో జాతీయ కట్టడాలను వెలుపల బయట నుండి కూడా అన్ని సమయాలలో ఫోటోలు తీయడం చట్టబద్ధమే. ఇలా తీసిన చిత్రాలను లేదా వీడియోలను లాభాపేక్షతో అమ్ముకోవడాన్ని కూడా భారతదేశ చట్టాలు నిరబంధించవు. అయితే ఆర్కెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పని చేస్తున్న కొన్ని కట్టడాల పై పరిశోధన జరుగుతున్న సమయాలలో నిర్బంధం ఉంది.