Nothing Special   »   [go: up one dir, main page]

కొలకలూరి స్వరూపరాణి

కొలకలూరి స్వరూపరాణి ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]

కొలకలూరి స్వరూపరాణి
జననం
కొలకలూరి స్వరూపరాణి

మే 1, 1943
వృత్తిఉపాధ్యాయిని
తల్లిదండ్రులు
  • గోవాడ నడకుర్తి వెంకటరత్నం (తండ్రి)
  • మంగాదేవి (తల్లి)

ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి, పండితులు. ఈమె గోవాడ గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత పంచకావ్యాలు, కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.

ఆమె తొలి రచన స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది కృష్ణా పత్రికలో ప్రచురించబడింది. ఉపాధ్యాయం అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ శివతాండవం ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. నన్నయ మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. విద్యాధర ప్రభాస అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.

ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు సన్మానించాడు. కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.

రచనలు

మార్చు
  • గంగావతరణ శివతాండవం
  • చంద్రగ్రహణం
  • ప్రబోధం
  • కల్యాణవాణి
  • నన్నయమహిళ
  • మేమంతా భటులం, విష్ణుమార్గ దర్శకులం అనే కవిత మొట్ట మొదట కృష్ణాపత్రిక లో వచన కవిత్వంగా ప్రచురించబడింది

ఈమె 2022, అక్టోబర్ 15వ తేదీన ఒంగోలు పట్టణంలో మరణించింది.[2]

మూలాలు

మార్చు
  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 568-9.
  2. న్యూస్ టుడే ఒంగోలు గ్రామీణం (16 October 2022). "కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి కన్నుమూత". ఈనాడు దినపత్రిక. Archived from the original on 16 October 2022. Retrieved 16 October 2022.