కలహండి జిల్లా

వికీపీడియా నుండి
(కలహంది జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కలాహండి
జిల్లా
ఎగువ: మాణికేశ్వరి ఆలయం దిగువ: డోకరిచంచర
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
Stateఒడిశా
ప్రధాన కార్యాలయంBhawanipatna
Government
 • కలెక్టరుDr Bijay Ketan Upadhyaya, IAS
 • Member of Lok SabhaArka Keshari Deo, BJD
విస్తీర్ణం
 • Total7,920 కి.మీ2 (3,060 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total15,73,054
 • జనసాంద్రత169/కి.మీ2 (440/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ, English
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
766 xxx
Vehicle registrationOD-08
లింగ నిష్పత్తి0.999 /
అక్షరాస్యత62.45%
లోక్‌సభ నియోజకవర్గంKalahandi
Vidhan Sabha constituency5
 
  • Bhawanipatna (80)
    Dharmagarh (79)
    Junagarh (78)
    Lanjigarh (77)
    Narla (81)
శీతోష్ణస్థితిAw (Köppen)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో కలాహండి జిల్లా (ఒడిషా:କଳାହାଣ୍ଡି) ఒకటి. భవానీపట్న ఈ జిల్లాకు కేంద్రం. పురాతన కాలంలో ఈ ప్రాంతం సుందరమైన, గొప్ప సాంస్కృతిక వైభవం కలిగి ఉంది. ఈ ప్రాతంలో పురాతత్వ త్రవ్వకాలలో రాతియుగం, ఇనుప యుగానికి చెందిన మానవ ఆవాసాలకు చెందిన ఆధారాలు లభించాయి.[2] ఈప్రాంతంలోని అసురగర్ 2000 సంవత్సరాలకు ముందునాటి నగరప్రాంతానికి చెందిన మానవ ఆవాసాల ఆధారాలు లభించాయి.[3] ఆసియాలో వరిపంట పండిచిన ప్రాతాలలో కలాహండి, కోరాపుట్ ప్రాంతాలు మొదటివని విశ్వసించబడుతుంది. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని " మహాకాంతారా " (గొప్ప అరణ్యం), కరుంద మండలం ( అని పిలిచేవారు. కురందం అంటే కురందం లేక మాణిక్యం, కెంపు (గార్నెట్), బెరుజ్, నీలం, అలెగ్జాండ్రా మొదలైన విలువైన రాళ్ళు లభించే ప్రాంతం అని అర్ధం. బ్రిటిష్ ఇండియాలో ఈ ప్రాంతం రాజసంస్థానంగా ఉంది. స్వతంత్రం తరువాత కలాహండి ప్రాతం (ప్రస్తుత నౌపడా జిల్లా ప్రాంతంతో కలిపి) ఒడిషాలో కలుపబడింది. 1967లో కలాహండి జిల్లాలోని కాశీపూర్ బ్లాకు పరిపాలనా సౌలభ్యంకొరకు రాయగడ జిల్లాలో కలుపబడింది. 1980లో కలాహండి జిల్లా వెనుకబడిన జిల్లా, కరువుకాటకాలకు, ఆకలి మరణాలకు కేంద్రంగా గుర్తించబడింది. దీనిని " కలాహండి సిండ్రోం "గా పిలిచారు.[4] గతంలో కలాహండి ప్రాంతం సంపన్నతకు చిహ్నంగా ఉండేది. చరిత్రలో ఈ ప్రాంతం వ్యవసాయం, అరణ్యం సంపద, రత్నాలు, బాక్సైట్, జానపద నృత్యాలు, జానపద సంగీతం, ఫోల్క్‌లోర్, హద్థకళలు, కళలకు ప్రతీకగా ఉండేది. 1993 నౌపడా ఉపవిభాగం జిల్లాగా రూపొందించబడింది. ప్రస్తుత కలాహండి పార్లమెంటు నియోజక వర్గంలో కహంది, నౌపడా జిల్లాలు భాగంగా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

కలాహండి భూభాగంలో పురాతన కాలంలో గొప్ప నాగరికత విలసిల్లింది. పురాతత్వ పరిశోధనలు రికార్డులలో హిమయుగం నుండి తెల్ లోయలోని పలు ప్రాంతాలలో ఆదిమ నాగరికత విల్లసినట్లు తెలియజేస్తున్నాయి. శిలాయుగపు అవశేషాలు కలాహండి, మొతర్ నదీముఖద్వారంలో ఉన్న ధర్ంఘర్ భూభాగాలలో లభించినట్లు నమోదు చేయబడి ఉంది. .[5] శిలాయుగపు చివరిదశలో ఉపయోగించిన పెద్ద రాతి గొడ్డలి కలాహండిలో వెలికితీయబడింది. .[6] " తెల్ నదీ నాగరికత " కలాహండి ప్రాంతంలో పూర్వం గొప్ప నాగరికత విలసిల్లిందని సమీపకాలంలో ఈ ప్రాంతంలో జరిగిన పురాతత్వ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.[7] తెల్ లోయలో కనుగొనబడిన పురాతత్వ సంపద ఈ ప్రాతం2000 సంవత్సరాలకు పూర్వమే నాకరికత, నగరీకరణ, కలిగిన సాస్కృతిక ప్రజలకు నివాసంగా ఉండేదని తెలియజేస్తుంది.'[3] కలాహండి, కోరాపుట్, బస్తర్ జిల్లాలు రామాయణం, మహాభారతంలో పేర్కొనబడిన కాంతార రాజ్యంలో భాగంగా ఉండేవని. అసుర్‌ఘర్ రాజధానిగా ఉండేదని విశ్వసిస్తున్నారు.[8]

కలాహండి పాలకులు

[మార్చు]

క్రీ.పూ 4వ శతాబ్దంలో కలాహండి భూభాగాన్ని " ఇంద్రవనం " అని పిలిచేవారు. ఇక్కడ మౌర్య సామ్రాజ్యం కొరకు అతి విలువైన రత్నాలు, వజ్రాలు భద్రపరచబడ్డాయి .[9] మౌర్య చక్రవర్తి అశోకుడు కలాహండి, కోరాపుట్, బస్తర్ ప్రాంతం అంతటినీ అటవీ భూమి అనే వారు.[10] అశోకుడు పాలించిన కాలంలో ఈ భూభాగాన్ని ఎవరూ స్వాధీనపరచు కోలేదు.[11] క్రైస్తవశకం ఆరంభకాలంలో ఈ ప్రాంతం " మహావనం " అని పిలువబడింది.[12] సా.శ. 4వ శతాబ్దంలో వ్యాఘ్రరాజా కలాహండి, అవిభాజిత కోరాపుట్, బస్తర్ జీల్లాలతో కలిసిన కాంతార దేశాన్ని పాలించాడు.[13] మహాకాంతారా దేశానికి అసురఘర్ రాజధానిగా ఉండేది.[14] వ్యాఘ్రరాజా తరువాత భవదత్తా వర్మన్, ఆర్థపతి, స్కందవర్మన్ వంటి నలా రాజులు 500 సంవత్సరాలు మహాకాంతార దక్షిణ భూభాగాన్ని పాలించారు. ఆకాలంలో ప్రాంతన్ని " నలవాడి విసయ " అని పిలువబడింది.[15] మిగిలిన మహాకాంతార భూభాగం (దిగువ తెల్ నదీ ప్రాంతం ) రాజా తస్తికరా ఆయన కుమారులు పాలించారు. ఆకాలంలో ఈ ప్రాంతం " పర్వతద్వరక " అని పిలువబడింది. బెల్ఖంది సమీపంలో ఉన్న తలభంరక రాజ్యరాజధానిగా ఉండేది. [12]

తుస్తికర

[మార్చు]

6వ శతాబ్దంలో తుస్తికర కలాహండిలో భూభాగంలో సరికొత్త రాజ్యం స్థాపించాడు. ఈ వంశానికి చెందిన ఇతర రాజులను గురించి మాత్రం అతి స్వల్పంగా మాత్రమే సమాచారం లభిస్తుంది. మరగుడా లోయ సరబపురియాలకు రాజధానిగా ఉండేది.[16] కలాహండి ప్రాంతం రాజవ్యవస్థను కోల్పోయింది. తరువాత కలాహండి దక్షిణ కోసలలో భాగంగా మారింది.[17] తరువాత ఈ ప్రాంతం కొంతకాలం త్రికలింగ అనే ప్రత్యేక ప్రాంతంలో భాగంగా మారింది. కలాహండి, కోరాపుట్, బస్తర్ జిల్లాల ప్రాంతం త్రికలింగ ప్రాంతమని పిలువబడింది. 9-10 శతాబ్ధాలలో ఈ ప్రాంతం పశ్చిమ ఒడిషాలో భాగంగా మారింది.[18] సోమవంశ రాజైన మొదటి మహాభగుప్తా (జనమేజయ 925-960) త్రిలిగాధిపతి బిరుద నామంతో పిలువబడ్డాడు. [19] త్రికలిగా కొంతకాలమే ఉంది. తరువాత చంద్రకంగాలు చంద్రకోటా మండలం (బ్రమరకోటా మండలం) పేరుతో సరికొత్త రాజ్యం స్థాపించారు.[20] అది తరువాత కలాహండి, కోరాపుట్ వరకు విస్తరించబడింది.

నాగా పాలన

[మార్చు]

కలాహండి ప్రాంతంలో నాగాల పాలన దాదాపు 1006 లో మొదలైంది. ఒడిషాలో కలాహండి నాగాల పాలన దాదాపు సంవత్సరాల కాలం (1050-1948) కొనసాగింది. 12వ శతాబ్దంలో కళింగ సాంరాజ్యానికి చెందిన గంగాలు చక్రకోట మండలాన్ని స్థాపించి కమలమండల అని పేరు మార్చారు.[21] తరువాత కలాహండి ప్రాంతం నాగాలాపాలనలో ఉంటూ గంగాలకు సామంత రాజ్యంగా ఉందేది. 14 వ శతాబ్దంలో నాగాలు గంగా సామ్రాజ్యం నుండి గజపతుల సాంరాజ్యానికి విధేయులైయ్యారు. 1548లో ఒడిషాలో గజపతులు ప్రాభవం క్షీణించగానే నాగాలు స్వతంత్రరాజులు అయ్యారు.

స్వతంత్ర రాజ్యంలో

[మార్చు]

స్వతంత్ర కలాహండి రాజ్యంలో నాగాల ఆధీనంలో 18 గర్బులు ఉండేవి. 18వ శతాబ్దంలో నాగపూర్‌కు చెందిన భొంస్లాలు కలాహండి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అయినా అప్పటికీ ఈ ప్రాంతంలో నాగల పాలన కొనసాగింది. 1853లో నాగపూర్ రాజాస్థానం బ్రిటిష్ ఆధీనంలోకి మారింది. మూడవ రఘుజీ వారసులు లేకుండా మరణించడంతో రాజ్యం బ్రిటిష్ ప్రభుత్వానికి స్వంతం అయింది. తరువాత కలాహండి బ్రిటిష్ వారి రాజాస్థానాలలో ఒకటిగా మారింది. తరువాత దీనిని " కరొండమండలం " పిలిచారు. మకారాజా ప్రతాప్ కేసరి తన వ్యాంలో " ఈ ప్రాంతం చారిత్రకంగా కుండమండలం"గా ఉండేదని ఇక్కడ కొరుండం అధికంగా లభించడమే ఇందుకు కారణం " అని పేర్కొన్నాడు.కలాహండికి ఈ పేరు రావడానికి నాగారాజుల కులదైవం " మణికేశ్వరి " దేవి (మాణిక్య దేవి ) ఒక కారణమని భావిస్తున్నారు.

స్వతంత్రం తరువాత

[మార్చు]

భరతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కలాహండి రాజాస్థానం ఇండియన్ యూనియన్‌లో 1948 జనవరి 1 న విలీనం అయింది. పాట్నా బలాంగిర్ జిల్లా, సుబర్ణపూర్ జిల్లా కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయబడింది. సంబల్పుర్‌కు చెందిన నౌపడా ఉపవిభాగం కలాహండి జిల్లాకు చేర్చబడింది. పరిపాలనా సౌలభ్యం కొరకు 1967లో కలాహండి జిల్లాలోని కాశీపూర్ మండలం రాయగడ విభాగానికి మార్చబడింది. 1993లో నౌపడా ఉపవిభాగం ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది. కలాహండి పార్లమెంటు నియోజక వర్గంలో ప్రస్తుత కలాహండి, నౌపడా జిల్లాలు ఉన్నాయి.

మాధ్యమంలో కలాహండి

[మార్చు]

కలాహండి జిల్లాలో సంభవించిన వరుస కరువుకాటకాలతో ఆర్థికంగా చితికిపోయిన రైతులగురించి వార్తామాధ్యమాలలో విశేష వార్తలు ప్రచురిమయ్యాయి. కలాహండి జిల్లాలో ఈ శతాబ్ధపు దీర్ఘకాల కరువు సంభవించింది. 1864,1884, 1897లలో కలాహండిలో వరుస కరువు సంభవించింది. 1899 కరువును " చపన్ సాలర్ దుర్భిక్షా " (35 సంవత్సరాల కరువు) అని వర్ణించారు. ఈ కరువు కలాహండి చరిత్రలో తీవ్రమైన సాంఘిక అంధకారం ఏర్పడడానికి దోహదం చేసింది. 1919-1920లో కలాహండి జిల్లాలో కలరా వ్యాపించిన తరువాత తిరిగి మరొక కరువు సంభవించింది. 1922-1923, 1925-1926, 1929-1930, 1954-195-1956 కలాహండిలో తిరిగి కరువు సంభవించింది. తరువాత 1965-66 లో కలాహండిలో సంభవించిన దుర్భరమైన కరువు పూర్తిగా కలాహండి ఆర్థికరంగాన్ని నేలమట్టం చేసింది. వర్షాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తి 75% క్షీణించింది. కరువు ప్రభావం 1967 వరకు కొనసాగింది.

1974-75 కరువు

[మార్చు]

1974-1975, 1985లో తిరిగి సంభవించిన కరువును దశాబ్ధపు కరువుగా వర్ణించారు. 1956-1966 కరువు తరువాత జిల్లాలోని సంపన్న రైతులు మధ్యతరగతి రైతుల స్థాయికి అలాగే మధ్యతరగతి రైతులు సామాన్య రైతుల స్థాయికి దిగజారారు. ప్రజలలో చాలా మంది శుకబాసీలుగా మారారు. కలాహండి ప్రాంతంలో భూమిలేని రైతు కూలీలను శుకబాసి (హాయిగా జీవించే వారు) అనడం ఒక వాడుక. ఈ ప్రాంతంలో " గై నై గొరు సుఖీ నీంద్ కరో " ( మంద లేని వాడు గురక పెట్టి నిద్రిస్తాడు) అనే సామెత వాడుకలో ఉంది. క్రమంలేని వర్షపాతం కారణంగా పంటలు నాశనం కావడం కారణంగా ప్రజలు కడుపేదవారుగా మారారు. ఆర్థిక గణాంకాల నిపుణులు కలాహండి జిల్లాలో ప్రతి 4-5 సంవత్సరాలకు ఒక సంవత్సరాకాలం కరువు సంభవిస్తుందని నిర్ధారించారు. కరువు కారణంగా కలాహండి జిల్లా ప్రాంతంలో గ్రామీణప్రాంత నిరుద్యోగం అధికరించడం, పరిశ్రమల క్షీణత, జనసంఖ్య అధికరించడం, అడవుల నరికివేత వంటి ప్రధాన సమస్యలు అధికమయ్యాయి. ప్రకృతి గుప్పిట తీవ్రంగా నలిగిన గ్రామీణ ప్రజలకు జీవించడానికి మార్గం అగమ్యగోచరం అయింది. ప్రజలకు మాతృభూమిని వదిలి వలస పోవలసిన అగత్యం ఏర్పడింది. 1980 వరకు కలాహండి వార్తా మాధ్యమాలకు కేంద్రంగా మారింది. ఇండియాటుడే పత్రిక [22] ఆర్థిక పరిస్థితుల కారణంగా కన్నబిడ్డను అమ్ముకున్న విషయం ప్రచురించినంది. ఆ వ్యాసం తరువాత అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి కలాహండి జిల్లాను సందర్శించి జిల్లా పేదరికం, కరువు సమస్యలను జాతీయవేదిక మీదకు తీసుకు వచ్చాడు. ఆకలి మరణాలు, పిల్లలను విక్రయించడం వంటి వార్తలు నివారణ ఉపాయాల పట్ల శ్రద్ధ, అభివృద్ధి ప్రణాళికలను చేపట్టడానికి దారితీసింది. వెనుకబాటుదనం కలాహండిని సంపన్న జిల్లా స్థాయి నుండి వెనుకబడిన జిల్లా స్థాయికి తీసుకు వచ్చింది. ఈ పరిషితిని సాంఘిక కార్యకర్తలు కలాహండి సిండ్రోమ్‌గా వర్ణించారు.[4] 1994లో ప్రధానమంత్రి పి.వి నరసింహారావు వెనుకబడిన అవిభాజిత కలాహండి, బలంగీర్, కోరాపుట్ జిల్లాలకు కె.బికె ప్రాజెక్టును మంజూరు చేసారు.అయినప్పటికీ జిల్లాలో మౌలిక సదుపాయాలు దుర్భర పరిస్థితిలో ఉన్నందున అభివృద్ధి పనులు చాలా మందకొడిగా సాగడం వలన కలాహండి ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో విఫలమై ప్రాజెక్టు రూపకల్పన స్థాయిలోనే ఆగిపోయినింది.

వెనుకబడిన జిల్లా

[మార్చు]

కలాహండి తరచుగా వనుకబాటు తనానికి చిహ్నంగా వార్తా మాధ్యమాలలో వర్ణించబడింది. ప్రముఖ సాహిత్యంలో కలాహండి జిల్లా చోటు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. 1994లో భవానీపట్నంలో జరిగిన " రాజ్య స్తారీయ లేఖక్ సమ్మేళన్ "లో పలువురు ఉపన్యాసకుల ప్రాంతీయ సాహిత్యకారులను ఆహ్వానించిన సమయంలో " ఆకలి మరణాలకు కలాహండి పేరును ఉదాహరణగా చూపించకూడదని కలంధిని ఆకలి మరణాలకు గుర్తుగా చిత్రీకరిస్తే కలాహండిలో ఉన్న సంపన్న విషయాలు మరుగున పడతాయని, ఆకలిమరణాలు నాణ్యానికి ఒక వైపు మాత్రమే అని " సూచించబడింది. అయినప్పటికీ రచయితలు, వేదాంతులు, సాంఘిక కార్యకర్తలు, పత్రికాసంపాదకులు, రాజకీయవాదులు మొదలైన వారు సాహిత్యంలో, వయాసాలు, సమీక్షలలో ప్రత్యేకంగా కలాహండి పేరును ఉపయోగించడం ఆగలేదు. డాక్టర్ తపన్ కుమార్ వ్రాసిన " కలాహండికవితలు " 2007లో ప్రచురించబడిన తరువాత తీవ్రమైన ప్రశంశలకు పాత్రమైంది. ఈ పుస్తకం కవిత్వానికి సాహిత్య అకాడమీ రజతోత్సవ బహుమతిని అందుకుంది.[23] కలాహండిని కేంద్రంగా చేసుకుని దర్శకుడు గౌతం ఘోష్ తీసిన చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్నాడు.[24] రాహుల్ గాంధి కలాహండిని పురీలియాతో పోల్చడం పశ్చిమ బెంగాల్లో తీవ్రవిమర్శకు దారితీసింది.[25]

ప్రస్తుత రాజకీయాలు

[మార్చు]
Sabha Mandap, Bhawanipatna Palace

రాజకీయంగా జిల్లాకు రాష్ట్ర, కేంద్రాలలో ముఖ్యత్వం లేదు. 2000-2004 లలో బిజూజనతాదళ్ మరుయి భారతీయ జనతాదళ్ సంయుక్తంగా ఎం.ఎల్.ఏ మరుయి ఎం.పి స్థానాలను చేపట్టాయి. 2009లో జాతీయ కాంగ్రెస్ ధర్మార్గ్ తప్ప మిగిలిన ఎం.ఎల్.ఏ స్థానాలను చేపట్టింది. కాంగ్రెస్ ఎం.పీ.లు భూపేందర్ సింగ్, జగన్నాథ్ పాట్నాయక్, రాష బిహారీ బెహ్రా పర్యాటకం, ఆదాయశాఖ, వ్యవసాయశాఖ మంత్రులుగా ఉన్నప్పటికీ ప్రజలను తృప్తి పరచలేక పోయారు. బూపేద్ర సింగ్ రాష్ట్రానికి ప్రతిపక్షనాయకుని హోదాలో ఉన్నాడు. ధర్మార్గ్ జియోజకవర్గం నుండి ఎన్నికైన పుష్పేంద్ర సింగ్ దేవ్ రాష్ట్ర మంత్రిపదనికి స్వీకరించాడు. రాజకీయ అసంతృప్తి కారణంగా జిల్లా ప్రజలు కోసల్ పేరిట ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. బాలగోపాల్ మిస్రా చేస్తున్న " కోసల్ ముక్తి రాథ్ "కు ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారు.

కరువుకాటకాలు

[మార్చు]

ఆకలి మరణాలకు, బీదరికానికి కలాహండి ఒడిషా, భారతీయ రాజకీయాలలో కేంద్రస్థానంగా మారింది. జిల్లాపట్ల కేంద్రం చూపించిన వివక్ష కేంద్ర రాజకీయాలలో ప్రతిఫలించింది. తరువాత ఎన్నికలలో 30 సంవత్సరాల కాలం కలాహండి నియోజకవర్గం కాంగ్రెస్ వ్యతిరేక అభ్యర్థిని ఎన్నిక చేసింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నంత కాలం కలాహండి జిల్లా జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడలేదు. 1980లో కహంధి జిల్లాను ఇందిరా గాంధీ సందర్శించింది. 1984లో రాజీవ్ గాంధీ కహంధి జిల్లాను సందర్శించాడు. 2004లో సోనియా గాంధీ కహంధి జిల్లాను సందర్శించింది, 2008, 2009, 2010 లలో గాంధి]] కహంధి జిల్లాను సందర్శించాడు. 1980 నుండి కేంద్రంలో దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన సాగింది. గత ప్రధానులైన ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి, పి.వి నరసింహారావు, ప్రస్తుత నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పాయ్, సోనియా గాంధి, రాహుల్ గాంధి మొదలైన వారు కలాహండిని సందర్శించారు. దీర్ఘకాలం కహంధి అభివృద్ధి కొరకు జరిగిన ప్రయత్నాలు స్వల్పంగా ఫలితం చూపాయి. ఉన్నత విద్య, జాతీయరహదారి, రైల్వే, పరిశ్రమలలో కొంత అభివృద్ధి జరిగింది. కలాహండి జిల్లాలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం పాలిస్తున్న సమయంలోనే జరిగింది. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగ ఉన్న సమయంలో ఉప్పర్ ఇంద్రావతి ఇరిగేషన్ ప్రాజెక్ట్, చంద్రశేకర్ ప్రధాన మంత్రిగ ఉన్న సమయంలో లాంజీఘర్ - జునాఘర్ రోడ్డు నిర్మాణం, అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రధాన మంత్రిగ ఉన్న సమయంలో కలాహండి మీదుగా పయనిస్తున్న జాతీయరహదారి 201, జాతీయరహదారి 207 నిర్మాణం జరిగాయి. ఈ ప్రాజెక్టులు పరిపూర్ణ సాధించలేదు.

పరిశ్రమలు

[మార్చు]

కేంద్రప్రభుత్వం కోరాపుట జిల్లాలో హెచ్.ఎ.ఎల్ ఫ్యాక్టరీ, ఎన్.ఎ.సి.ఓ ఫ్యాక్టరీ (కె.బి.కె) వంటి ప్రైవేటు సంస్థలను మంజూరు చేసింది. ఆయుధ తయారీ కర్మాగారం బలంగీర్ జిల్లాకు మంజూరు చేయబడింది. 62 సంవత్సరాలకాలం కలాహండి జిల్లాలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయబడలేదు. ప్రాంతీయ వాసులు రైల్వే, రహదారి, రైల్వే కర్మాగారం మంజూరు చేయబడ లేదు.

పాలన

[మార్చు]
  • కలాహండి జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది: భవానీపట్న, ధరమార్గ్.
  • జిల్లాలో 13 బ్లాకులు ఉన్నాయి :
  • భవానీపట్న ఉపవిభాగంలో భవనిపట్న, కేసింగ, లంజిగర్హ్, నర్ల, కర్లముంద, ఎం. రాంపుర్, అంద్ టి. రాంపుర్ మండలాలు ఉన్నాయి.
  • ధరంగర్హ్ ఉపవిభాగంలో ధరంగర్హ్, జునగర్హ్, కొక్సర, జైపత్న, కలంపుర్, అంద్ గొలముంద మండలాలు ఉన్నాయి.

నీటిపారుదల

[మార్చు]

కలాహండి రాజాస్థానంగా ఉన్నసమయంలో 1946-1947 లో మహారాజా ప్రతాప్ సింగ్ దేవ్ ఆధ్వర్యంలో ఇంద్రావతి నదీ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడింది. అయినప్పటికీ అది కార్యరూపం ధరించడానికి దదాపు 30 సంవత్సరాల కాలం పట్టింది. స్వాతంత్ర్యానంతరం ప్రధాని కి.శే మొరార్జీదేశాయ్ పాలనలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. జలవిద్యుదుత్పత్తి, నీటిపారుదల ప్రధానంగా ఈ ప్రాజెక్టు చేపట్టబడింది. స్వాతంత్ర్యం తరువాత అప్పటి వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడమే ఈ జాప్యానికి కారణమని అనేక మంది ప్రజలు భావించారు. కాంగ్రెసేతర సభ్యుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినందున జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందని ప్రజలు భావించారు. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రాజెక్టుకు అనుమతి తెలిపిన తరువాత కూడా పలు రాజకీయలో పాల కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం ధరించడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది. " అప్పర్ ఇంద్రావతి హైడ్రాలిక్, ఇరిగేషన్ ప్రాజెక్టు " కారణంగా జిల్లాలో గుర్తించతగినంత వ్యవసాయాభివృద్ధి జరిగింది. ఈ ప్రాజెక్టు నుండి జిల్లాలోని కొక్సర, గొలముంద, భవానీపట్న మండలాలకు నీటిని అందించడానికి నిధుల కొరత కారణంగా సమస్యలు ఎదురౌతూ ఉన్నాయి. వ్యవసాయానికి ఉపయోగించకుండానే ఈ ప్రాజెక్టు నుండి జలాలు హతీ నదిలోకి వదిలివేయబడుతున్నాయి. ఇలాగే టేల్ నదిమీద నీటిపారుదల కొరకు వాటర్ షెడ్లు కట్టాలన్న ప్రతిపాదనకు ఇంకా ప్రభుత్వ అనుమతి లభించ లేదు.

కేంద్రవిశ్వవిద్యాలయం కొరకు పోరాటం

[మార్చు]

Refer to video Part I,[26] II[27] and III[28] స్వతంత్రం లభించిన నాటి నున్ండి కలాహండి ఉన్నత విద్య కొరకు సమస్యలను ఎదుకొంటున్నది. కలాహండిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజి స్థాపించడానికి చేసిన మొదటి ప్రతిపాదన తరువాత 1980లో కోరాపుట్ జిల్లాలో చేసిన ప్రతిపాదన రాజకీయాల కారణంగా ఒడిషాలోని ఇతర ప్రాంతాలకు తరలించబడింది. కలాహండి, బలంగీర్ మరొయు కోరాపుట్ ప్రాంతాలను సందర్శించిన ప్లానింగ్ కమిషన్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజి స్థాపించాలని సూచించింది. 1988లో కలాహండి ప్రజలు తీవ్రంగా సెంట్రల్ యూనివర్శిటీ కావాలని నిర్బంధించారు. ఈ జిల్లా కె.బి.కె జిల్లాలకు కేంద్రస్థానంగా ఉందని సమీపంలో ఉన్న కేసింగా రైల్వే స్టేషను ద్వారా దేశంలోని ఇతర నగరాలకు ప్రయాణసౌకర్యాలు ఉన్నాయని అందుకని విశ్వవిద్యాలయ స్థాపనకు ఇది అనువైన ప్రాంతమని ప్రజల వాదన. 1990 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర ఒడిషాలో విశ్వవిద్యాలయం స్థాపించాలని నిర్ణయించింది. కలాహండి ప్రజలు ఆవిశ్వవిద్యాలయం తమ జిల్లాకు కావాలని కోరిక వెలిబుచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి బిజూపాట్నాయక్ అందుకు అంగీకారం తెలుపక పోయినా తరువాత పదవిని చేపట్టిన గిరిధర్ గోమాంగ్ 1999లో బరిపద, బాలాసోర్ జిల్లాలలో రెండు విశ్వవిద్యాలయాల స్థాపనకు అంగీకారం తెలిపాడు. ఇది కలాహండి ప్రజలను అసంతృప్తికి గురిచేసింది. 2002లో " కలాహండి శిఖ్య బికాష్ పరిషద్ ", " సెంట్రల్ యూనివర్శిటీ క్రియా కమిటీ " సెంట్రల్ యూనివర్శిటీ కొరకు తీవ్రంగా సమ్మె చేసారు. 9 సంవత్సరాల నుండి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పలు మెమరాండాలు పంపారు. కేంద్ర విశ్వవిద్యాలయాలు లేని రాష్ట్రాలలో 12 విశ్వవిద్యాలయాలు స్థాపించాలని కేంద్రం ప్రతిపాదించిన సమయంలో కలాహండి నుండి ప్రనిధుల బృందం ఒడిషా ముఖ్యమంత్రి బిజూ పాట్నాయక్ కలుసుకుని కలాహండిలో కేంద్ర విశ్వవిద్యాలయం కావాలని కోరిక వెలిబుచ్చారు.[29] అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పాట్నాయక్ అందుకు అంగీరించి విశ్వవిద్యాలయానికి అవసరమైన భూమి వివరాలు ఇవ్వమని అడిగాడు. ప్రజలు భూమి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ ద్వారా 2008 జూలై మాసంలో వివరాలను పంపారు. అయినప్పటికీ విశ్వవిద్యాలయం కోరాపుట్ జిల్లాలో స్థాపినాలని ప్రతిపాదన చేయబడింది.[30] అందువలన ఇది భవానీపట్నలో రావచ్చని భావించారు..[31] 6 మాసాల తరువాత ముఖ్యమంత్రి భవానీపట్న వద్ద అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కాలేజి స్థాపించాలని ప్రతిపాదన చేసాడు. .[32] కలాహండి ప్రజలు ఈ ప్రతిపాదనను స్వాగతించారు. కలాహండి సిఖ్య బికాస్, కలాహండిసెంట్రల్ యూనివర్శిటీ " ఇది కేంద్ర యూనివర్శిటీకి సమానం కాదు " అని వ్యాఖ్యానించారు.[33]

రైల్వే ఫ్యాక్టరీ కొరకు పోరాటం

[మార్చు]

కలాహండి, నౌపడ జిల్లాలలో ఇతర జిల్లాల కంటే వలస కూలీలు అధికసంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం మాత్రమే చాలినంత ఉపాధి కల్పించలేదు. కనుక పరిశ్రమలు కూడా అధికరించాలి. ప్రాంతీయ వాసులో 15 సంవత్సరాలుగా పెండిగ్‌లో రైల్వే ఫ్యాక్టరీ కొరకు ఆందోళన చేస్తున్నారు. 2010-2011 లో ఇండియన్ రైల్వే బడ్జెట్లో భువనేశ్వర్‌ లేక కలాహండిలలో రైలు వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ స్థాపించాలని ప్రతిపాదించింది.[34] 2011 నాటికి లంఘీఘర్ - భవానీపట్న, సెక్షన్ ఆఫ్ లంగీఘర్ రోడ్ - జనాగడ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయింది. భువనేశ్వర్ నుండి ఈ మార్గంలో పాసింజర్ సర్వీసు ఆరంభం అయింది.

భౌగోళికం

[మార్చు]

కలాహండి జిల్లా 19.3 ఉత్తరం నుండి 21.5 ఉత్తరం అక్షాంశం, 82.20 తూర్పు నుండి 83.47 తూర్పు రేఖాంశంలో ఉంది.[35] ఇది రాష్ట్ర పశ్చిమ భూభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులోబలంగీర్ జిల్లా, తూర్పు సరుహద్దులో నౌపడా జిల్లా, దక్షిణ సరిహద్దులో నబరంగ్‌పూర్ జిల్లా కోరాపుట్ జిల్లా, తూర్పు సరిహద్దులో రాయగడ జిల్లా, కంథమాల్ జిల్లా, బౌధ్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 8,364.89 చ.కి.మీ. ఈ జిల్లా వైశాల్యపరంగా రాష్ట్రంలో 7వస్థానంలో ఉంది. భవానీపట్నం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది జిల్లాకు పూర్తిగా మద్య స్థానంలో ఉంది. కలాహండి జిల్లాలో భవానీపట్న, ధర్మఘర్ ఉపవిభాగాలు ఉన్నాయి. అదనంగా జునాఘర్, జైపాట్నా కేసింగా, లాంజిఘర్, ముఖిగుడా వంటి పట్టణాలు ఉన్నాయి.

నైసర్గికం

[మార్చు]

భౌగోళుకంగా కలాహండి మైదానాలు, పర్వతాలు అధికంగా ఉన్నాయి. కలాహండి చుట్టూ పర్వతాలు ఉన్నాయి. సరిహద్దులో ఉన్న కోరాపుట్, రాయగడ, కంథమల్ జిల్లాలు కూడా కొండలు, పర్వతాల మయంగా ఉంటాయి. జిల్లాలో మూడవ భాగంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. జిల్లాలో పరిశ్రమలు తక్కువగానే ఉన్నాయి. బాక్సైట్, గ్రానైట్ గనులు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కలాహండి జిల్లా ఒకటి అని గుర్తించింది..[36] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[36]

వ్యవసాయం

[మార్చు]

కలాహండి జిల్లా అధికంగా వ్యవసాయ ఆధారిత ఆదాయం కలిగి ఉంది. బెంగాలీ కరువు సమయంలో కలాహండి జిల్లా మాత్రమే 100,000 టన్నుల బియ్యం బెంగాలుకు అందించింది. 1930లో కలాహండిరాజాస్థానం " అప్పర్ ఇంద్రావతి ప్రాజెక్ట్ " ప్రతిపాదన చేసింది. తరువాత కలాహండి భారతప్రభుత్వంలో విలీనం కారణంగా ప్రాజెక్ట్ జాప్యం అయింది. 1978లో ఈ ప్రాజెక్టు మంజూరు చేయబడింది. 1960లో, 1980లలో జిల్లాలో కరువు సంభవించింది. ఈ కరువులో జరిగిన పిల్లల అమ్మకాల సంఘటన, పోషకాహార లోపం, ఆకలి మరణాల వంటి సంఘటనలు వార్తా మాధ్యమాలలో కలాహండి కేంద్రంగా చేసాయి. ఈ కరువును సాఘసేవకులు " కలాహండి దుర్ఘటనలు " పేర్కొన్నారు.[4] Though KBK[37]1990లో కేంద్రప్రభుత్వం అవిభాజిత కలాహండి, బలంగీర్, కోరాపుట్ జిల్లాలలోని కరువు, వెనుకబాటు తనం, ఆకలి మరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించింది.

కలాహండి జిల్లా విభిన్న ఆర్థిక పరిస్థితులకు ఒక ఉదాహరణగా ఉంటుంది. జిల్లాలో అభివృద్ధి వెనుకబాటుతనం కలిసి పయనిస్తుంటాయి. ఒకవైపు కరువు, ఆకలి మరణాలకు ఈ జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందింది. మరొకవైపు ఈ జిల్లా వ్యవసాయ అభివృద్ధిని సాధించిన జిల్లాగా గుర్తించబడుతుంది. చారిత్రాత్మకంగా ధరమార్గ్ ఉప విభాగం బియ్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2000 నుండి ఇంద్రావతి వాటర్ ప్రాజెక్ట్‌ (రాష్ట్రంలో ఇది రెండవ స్థానంలో ఉంది) కారణంగా దక్షిణ కలాహండిలో వార్షికంగా రెండు పంటలు పండించడానికి అనుకూలత లభించింది. అందువలన కలంపూర్, జైపట్న, ధరంఘర్, జుంఘర్, భవానీపట్న మండలాలు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాయి. అందువలన కలాహండి జిల్లాలో ఉన్న రైస్ మిల్లుల సంఖ్యలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. 2004 -2005 నాటికి కలాహండిలో 150 రైసుమిల్లులు నిర్మించబడ్డాయి.

వనసంపద

[మార్చు]

జిల్లాలో అటవీ ఆధారిత మహుయా, కెందు ఆకులు, కట్టెలు, కొయ్య, వెదురు వంటి ఉత్పత్తులు కూడా ప్రాంతీయ ఆదాయంలో పెద్ద ఎత్తున సహకరిస్తుంది. కలాహండి నుండి సమీపంలోని రాయగడ, జాజ్‌పూర్ లలో ఉన్న పేపర్ మిల్లులకు అవసరమైన ముడిసరుకు లభిస్తుంది.

రత్నాలు

[మార్చు]

కలాహండి జిల్లా రత్నాలకు ప్రసిద్ధిచెందినది. అందువలన ఈ ప్రాంతం కరొండ మండలం అయింది. ఇక్కడ కురువిందం అధికంగా లభ్యం ఔతుంది.అంతేకాక జిల్లాలో కేట్స్ ఐ, నీలం, రూబీ, గార్నెట్, క్రిస్టల్, పుష్పరాగము, మూన్స్తొనె, డైమండ్, తౌర్మొలినె, అక్వామారిన్, బెర్య్లె, అలెగ్జాడ్రైట్ వంటి రత్నాలు అత్యధికంగా లభ్యం ఔతున్నాయి. ఇక్కడ లభించిన రత్నాల గురించిన విలువైన రత్నాలు, అర్ధ శాతం విలువైన రత్నాల గురించిన వివరణ పణిని (క్రీ.పూ 5వ శతాబ్దం), కౌటిల్య (క్రీ.పూ 3వ శతాబ్దం), ప్టోల్మీ (సా.శ. 2వ శతాబ్దం), హూయంత్సాంగ్ (సా.శ. 7వ శతాబ్దం), ట్రావనీర్ (సా.శ. 19వ శతాబ్దం) లలో లభిస్తుంది. సరీపకాలంలో కలాహండి, బలంగీర్ లతో హస్థకళాకారులకు రత్నాలను సరఫరాచేసింది. వీటిని ఢిల్లీ ప్రాంతాలలో చూడవచ్చు. జియోగ్రాఫికల్ సర్వే ఆధారంగా కలాహండిలోని జునాగఢ్ సమీపంలో ఉన్న జిలింగ్దరలో ఆసియాలోనే అధిక మొత్తంలో కెంపు లభించింది. [38]

పరిశ్రమ

[మార్చు]

వేదాంత అల్యూమినియా లిమిటెడ్ (వి.ఎ.ఎల్) [39] జిల్లాలో స్టెరిలైట్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుబంధ సంస్థ, ప్రముఖమైన అల్యూమినియం రిఫైనరీ సంస్థ ప్రతిపాదించిన ఎం.టి.పి.ఎ అల్యూమినియా రిఫైనరీ, 75 మె.వా ఉత్పాదన శక్తికలిగిన పవర్ ప్లాంటు ఉన్నాయి. ఆరంభంలో పర్యావరణ పరిరక్షకులు దీనిని మొదట వమర్శిస్తూ వ్యతిరేకించారు. ప్రత్యేకంగా నియమగిరి గిరిజనులు దీనిని వ్యతిరేకించారు. వి.ఎ.ఎల్ మద్దతుదార్లు ఈ ప్రాజెక్ట్ లాంజిఘర్, కలాహండి సాంఘిక, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని వాదించి విజయం సాధించారు. నియమగిరి కొండలలో వేదాంత గ్రూప్, స్టెరిలైట్ ఇండస్ట్రీ జాయింట్ వెంచర్‌లో చేపట్టాలనుకున్న బాక్సైట్ గనుల త్రవ్వకానికి యూనియన్ ఎంవిరాన్మెంటు మినిస్టరీ మొదట నిరాకరించింది.[40] అందువలన ఈ సంస్థలు తమకు అవసరమైన బాక్సైటును ఒడిషాకు వెలుపలి నుండి తెప్పించుకున్నారు. రిఫైనరీ సంస్థ 6ఎం.టి.పి.ఏకు విస్తరణ చేయలని చేసిన ప్రతిపాదనను పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. [41]

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

భారతదేశంలో నగరాలు అధికశాతం రోజువారీ విమానాలు కలిగి; కలాహండి పట్టణానికి సమీపంలో రాయ్పూర్ విమానాశ్రయం (km 200-250 కి.మీ) ఉంది . రాయ్పూర్ నౌపడా లేదా ఢరమ్గర్హ ద్వారా. 300 కి.మీ దూరంలో ఉన్న విశాఖపట్నం విమానాశ్రయం చేరుకోవచ్చు. 450 కి.మీ దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయం ఉంది,

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,573,054,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[44]
అమెరికాలోని. ఇదాహో నగర జనసంఖ్యకు సమం.[45]
640 భారతదేశ జిల్లాలలో. 317 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 119 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.79%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 1003:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 60.22%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

భాష, సాహిత్యం

[మార్చు]

కలాహండి జిల్లాలో ప్రజలు కలాహండియా భాషను మాట్లాడుతుంటారు. కలాహండియా భాష ఒడిషా అధికార భాషగా గుర్తించబడుతుంది. ప్రాంతీయంగా ప్రచురించబడుతున్న " అర్జి", కలాహండి ఎక్స్‌ప్రెస్ ఒరియా, కలాహండియా భాషలలో వెలువడుతున్నాయి. జిల్లాలో ఒరియా తతువాత హిందీ భాష రెండవ స్థానంలోఉంది. జిల్లాలో వాడుకలో ఉన్న ఇతర భాషలు కుయి, భత్రి, పర్జి, భుంజియయా భాషలు ప్రధానమైనవి. జిల్లాలో దాదాపు 7000 మంది భుంజియా ఆదివాసీలలో భుంజియా భాష వాడుకలో ఉంది.[46]

సాహిత్యం

[మార్చు]

జిల్లాలోని గుర్తించతగిన రచయితలు, కవులు, నాటకరంగ కళాకారులలో కొందర్: చైతన్య దాస్, పతరజ పద్మన్ సింగ్, మహారాజా ఉదిత్ ప్రతాప్, మహారాణి ఆశా కుమారి దేవి, రామ చంద్ర రైగురు, బ్రజరజ్ సింఘ్దెఒ, టూర్ బిక్రం దేవ్, లై రుద్ర మధబ్ దేవ్, గదధర్ మిశ్రా, పరశురామ్ యౌవన, డాక్టర్ సొమెస్వర్ బెహెర, కవిరాజ్ ప్రయగ్దుత్త జోషి, అనూప్ సింఘ్దె, ప్రొఫెసర్ భువనేశ్వర్ బెహెర, ప్రఫుల్ల కుమార్ రథ్, అఖిల నాయక్, భారత్ మాఝి, పరమేశ్వర్ యౌవన, డాక్టర్ డోలా గోవింద బిసి, డాక్టర్ హరే కృష్ణ మెహర్, ఇతరులు.

సంస్కృతి

[మార్చు]

కలాహండి సంప్రదాయం, ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది.[47] దక్షిణ ఒడిషా, పశ్చిమ ఒడిషా లలో గణజీయమైన సంఖ్యలో గిరిజన ప్రజలు ఉన్నారు. వీరు కొండలు, మైదానాలలో నివసిస్తున్నారు. వారు వైవిధ్యం సంస్కృతి, సంప్రదాయం, హిందూ మతసంబంధిత మతవిశ్వాసాలు కలాహండిని సంస్కృతీ సంపన్న ప్రాంతంగా చేసాయి. కలాహండిలో ఆర్యన్, గిరిజన సంప్రదాయం ప్రతిబింభిస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు కలాహండిలో శైవం, వైష్ణవం, శాక్తేయం ఆధిక్యతలో ఉంది. గిరిజనులలో శాక్తేయం అధీఖ్యతలో ఉంది. అందువలన కలాహండిలో శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఉంది. ఒడిషాలో కలాహండి విలీనం తరువాత కలాహండిలో తీరప్రాంత ఒడిషా సంప్రదాయం ప్రభావం చూపింది. పురాతన కాలంలో రాధాకృష్ణ ఆలయం నిర్మించినట్లు స్వాతంత్ర్యానంతరం జగన్నాథ ఆలయాల నిర్మాణం, రథయాత్రా నిర్వహణ అధికం అయింది.

ప్రాంతీయ ఆచారాలు

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా హిందువులు అధికంగా ఉన్నారు. స్వల్పంగా క్రైస్తవులు, ముస్లిములు, సిక్కులు, బుద్ధిస్ట్, జైన్ ప్రజలు ఉన్నారు. 28% ప్రజలు గిరిజనులు ఉన్నారు. గిరిజన ప్రజల మీద ప్రాంతీయ ఆచారాలు, భాషా ప్రభావం అధికంగా ఉంది.

కళాలు, హస్తకళలు

[మార్చు]

సాధారణంగా కలాహండి అంటే " పాట్ ఆర్ట్స్ " అని అర్ధం. కలాహండి కళలకు, హస్థకళలకు పుట్టిల్లు. జిల్లాలో ఉన్న" గుడహండి గుహలు " కూడా ఈ పేరు రావడానికి కారణమని భావిస్తున్నారు. ఈ గుహలలో చరిత్రకు పూర్వకాలం నాటి ఎరుపు, నలుపు వర్ణాలతో చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. కలాహండి రాతితో చేసిన ఆభరణాలకు ప్రసిద్ధిచెంది ఉంది. హబసపురి నమూనాలో చేసిన నేత చీరలకు కలాహండి ప్రసిద్ధి చెందింది. ఖైపదర్ వుడ్ క్రాఫ్ట్‌కు దేశవిదేశాలలో గిరాకీ ఉంది.

నృత్యం, సంగీతం

[మార్చు]

కలాహండి జిల్లాలో పలు వైవిధ్యమైన గిరిజన, సంప్రదాయ నృత్యరీతులు వాడుకలో ఉన్నాయి. ఒడిషా రాష్ట్రంలో జిల్లా స్థాయిలో కలాహండి నృత్య సంప్రదాయం మొదటి స్థానంలో ఉంది. కలాహండి జిల్లాలోని ప్రజల జీవితం అధికంగా నృత్యం, సంగీతంతో ముడిపడి ఉంది. కలాహండి జిల్లాలో దాల్‌ ఖై, జైఫులా, రాస్ర్కెలి, సజాని మొదలైన నృత్యరీతులు వాడుకలో ఉన్నాయి. ఇవి బలంగిర్, సంబల్పూర్ నృత్యాలను పోలి ఉన్నాయి.[48] whereas Sari song, Pholia song, song related to nature etc. has similarities with Koraput region. However, Boria song, Nialimali, Kalakolik etc. కలాహండిలో అదనంగా ఘుమురా, మదలై, దందారి, ధాబ్, బజసలియా మొదలైన నృత్యరీతులు ఉన్నాయి. కలాహండి జపదగీతాలు రూపకల్పన చేయబడినవి.

ఘుమురా నృత్యం

[మార్చు]

ఘుమురా నృత్యం కలాహండి ప్రజలు అభిమానించే జానపద నృత్యం. ఘుమురా నృత్యంలో దుస్తులు గిరిజన జాపదనృత్యాల వలె ఉండి ఈ నృత్యం గిరిజన తెగల నృత్యంగా ఉంటుందని సమీపకాల పరిశోధకులు భావిస్తున్నారు.[49] ప్రస్తుత ఘుమురా నృత్యంలో క్లాసికల్ నృత్యంలో ఉండే ముద్రలు ఉంటాయి. ఈ నృత్యం గురించి పలు పరిశోధనలు నిర్వహించినప్పటికీ ఘుమురా నృత్య ఆరంభ కాలం, మూలాలు లభించ లేదు. .[50] భారతీయ పురాతన యుద్ధనృత్యాలలో ఒకటైన ఈ నృత్యంలో రామాయణం లోని రామ రావణ యుద్ధ ఘట్టాలు చోటుచేసుకుంటాయి. కోణార్క్‌లోని సూర్యదేవాలయంలో చెక్కబడిన ఈ నృత్యం ఇది మద్యయుగంలో ఉనికిలో తెలియజేస్తుంది. యుద్ధనృత్యం అయిన ఘుమురా నేత్యంలో సాంఘిక, సాంస్కృతిక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ నృత్యం ప్రస్తుతం అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలలో సాంఘిక వినోదం, వెసులుబాటు, ప్రేమ, భక్తి, స్నేహం సౌబ్రాత్రత్వం అభివృద్ధికి దోహదం చేస్తుంది. సంప్రదాయపరంగా ఈ నృత్యం నౌఖై నృత్యంతో సంబంధితమై ఉంటుంది. ఘుమురా నృత్యం ఇప్పటికీ దక్షిణ ఒడిషాలోని గ్రామాలకు, సరిహద్దులోని చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు పరిమితమై ఉంది. కలాహండి భూభాగం ఘుమురా నృత్యం ప్రజాదరణ పొందడంలో, ఘుమురా నృత్యం ప్రత్యేకత రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఢిల్లీలో జర్రిగిన అతంర్జాతీయ ప్రదర్శనలలో ప్రదర్శన నిర్వహించడానికి, మాస్కో, ఇతర ప్రదేశాలలో ఘుమురా నృత్యానికి అవకాశం లభించింది.

నృత్య సంప్రదాయాల జాబితా

[మార్చు]
  • బనబది: కలాహండిలో గౌడ (జాదవ్ కమ్యూనిటీ) నృత్యం. ఇది కూడా గౌర్బది నృత్యం అంటారు.
  • బజసల్:
  • భీసలీ:
  • షమన్:
  • డల్ఖై: ప్రముఖ సంబల్పూర్ నృత్యాన్ని పోలి ఉంటుంది, సంబల్పూర్-బలంగీర్ ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.
  • బందరి:
  • ఢన్ర:
  • ఢప్: దీనిని కూడా ఢంగ్ర ఢంగ్రి నృత్యం అని కూడా అంటారు
  • దొంగ్రీ కోండ్ డాన్స్: ఇది ఒడిషా యొక్క రయగ్ద జిల్లా బొరెరింగ్ కనబడుతుంది. ఇటీవల డొంగ్రీ కోండ్ కమ్యూనిటీ వివాదాస్పద వేదాంత ప్రాజెక్ట్, నియంగిరి మైనింగ్ కోసం దృష్టిని ఆకర్షించింది.
  • ఖొత్ల:
  • మదలి:
  • పరజ డాన్స్: ఇది ఒడిషా కోరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కాన్గిరి జిల్లాల్లో కనబడుతుంది.
  • రసర్కెలి: ఒక సాధారణ పాశ్చాత్య ఒడిషా జానపద నృత్యం. ఇతర నృత్యం జైఫుల, సజని మొదలైనవి
  • రనప: నృత్య కలాహండిలో వేరే రూపంలో ఉంది, ఇది దక్షిణ, పశ్చిమ ఒడిషా ప్రాంతాలలోని గంజాం, గజపతి, కలాహండి, ఇతర జిల్లాలలో ఒక నిర్దిష్ట కుల సమూహ * నృత్యం
  • సింఘ్బజ:

పండుగలు

[మార్చు]

ప్రబల హిందూ పండుగలు

[మార్చు]
Chhatra Jatra in Bhawanipatna
  • దసరా:- దసరా (దుర్గాపూజ) భారతదేశం అంతటా హిందువుల చేత ఘనంగా నిర్వహించబడే ఉత్సవం. అయినప్పటికీ ఇది పశ్చిమ బెంగాల్, ఒడిషా,అస్సాం మొదలైన తూర్పు భారత రాష్ట్రాలలో ఈ పండుగ సందర్భంలో కాళీ మాత ఆరాధానలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దసరా సందర్భంలో గిరిజనులు దుర్గా మాతను ఆరాధిస్తారు. కలాహండిలో దసరా సందర్భంలో ప్రధానంగా మణికేశ్వరి, లంకేశ్వరి, దంతేశ్వరి, కామేశ్వరి, భంద్రఖారన్ మొదలైన దేవతలను ఆరాధిస్తుంటారు.
  • కలాహండిలో ప్రధాన పండుగలు చాటర్ జాత్ర, కందబాషా, బుధరాజా జాత్రా మొదలైన ఉత్సవాలను ప్రధానంగా నిర్వహిస్తుంటారు. కలాహండిలోని శక్తిపీఠంలో కూడా దసరా వైభంగా నిర్వహించబడుతుంది.
  • దేవ్ల్ లేక దీపావళి :- దీనిని దివాలి అని కూడా అంటారు. ఈ పండుగను మార్వాడీ వంటి వలస సమూహాలకు చెందిన ప్రజలు నిర్వహిస్తూ ఉన్న ఈ పండుగ వేడుకలలో ఇప్పుడు అందరూ

పాల్గొంటున్నారు.

  • రథజాత్ర :- కలాహండి ప్రజలు పూరీ ప్రేరణతో రథయాత్రా పండుగ జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్యానంతరం కలాహండి ఒడిషాలో విలీనం అయిన తరువాత తీరప్రాంత ఒరియా సంస్కృతి కలాహండిలోకూడా ప్రభావం చూపింది. 1950 తరువాత కలాహండిలో పలు సరికొత్త జగన్నాధ ఆలయాలు నిర్మించబడ్డాయి. రథయాత్రా నిర్వహణ కూడా అధికరించింది. వలస వ్యాపార సమూహాలు, తీరప్రాంత ఒడిషా ప్రభుత్వ అధికారులు ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
  • శివరాత్రి:
  • హోళి :
  • జన్మాష్టమి :
  • రామనబమి :

ప్రాంతీయ ప్రత్యేకతలు

[మార్చు]
Chhatar of Chhatra Jatra in Bhawanipatna
  • చాటర్ జాత్ర : ఈ ఉత్సవం భవానిపట్నంలో జరుపుకుంటున్నారు.
  • ఖందబస : ఈ ఉత్సవం జనాగడ్ (కలాహండి) లోని లంకేశ్వరి ఆలయంలో నిర్వహించబడింది.
  • నౌఖై : ఇది పశ్చిమ ఒడిషా, కలాహండిలో జరుగుతున్న ప్రాంతీయ ఉత్సవం. ఇది గిరిజన తెగల మధ్య నుండి వచ్చిన కొత్త పంటలకు సంబంధించిన ఉత్సవం అయినప్పటికీ ఇప్పుడిది కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. నౌఖై ఉత్సవాలను జరుపుకుంటున్న ప్రస్తుతం క్రైస్తవమతానికి మర్చబడిన గిరిజనులు అనేక మంది ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. గిరిజన ప్రజలు పలురకాల నౌఖై ఉత్సవాలను జరుపుకుంటున్నారు. వీటిలో ధానై నౌఖై ఉత్సవం ప్రధానమైంది.
  • పొర ఊన్స్:
  • అమ్నూన్ ఈ ఆం:- (మామిడి) కోసం జరుపుకునే నౌఖై వేడుక.
  • కందుల్నూన్: ఈ పండుగ కందుల (పప్పు ఒకటి రకం)కొరకు జరుపుకునే నౌఖై వేడుక.
  • కెమినూన్ : సెమీ ( ఒక రకమైన బీన్స్ ) కోసం జరుపుకునే కూఖై వేడుక.
  • దుమెర్నూన్: ఇది ఒక రకమైన అడవి పండు పోలివుంది. జరుపుకునే నౌఖై వేడుక.
  • కెందునూన్: కెందు, మరొకరకమైన అడవి పండు కొరకు జరుపుకునే నౌఖై వేడుక.
  • కలాహండి ఉత్సవ్:[51] జిల్లా నిర్వాకులతో చేర్చి భావానీపట్న మరయు దరంఘర్ లలో కూడా నిర్వహించబడుతుంది.
  • ప్రజా పర్మంజ్ :- గిరిజన సంస్కృతి సంబంధిత ఉత్సవం.
  • చైత్ర లేక చైత్ పరబ్.
  • భెజింత
  • పొజింత
  • శస్తి ఒష
  • జణి ఒష
  • బెల్జత్ర
  • పుస్పరబ్
  • ఛెర్చెర
  • బిహంచ్హిన
  • పోల్ ఊన్ష్
  • పొర ఊన్ష్
  • నాగ్బొం

ఆహారసంస్కృతి

[మార్చు]
  • వెజిటబుల్ కర్రీ: అలూ కూబి, అలూ ఝొల్, గొరొస్ కోబి నడ, బిగ్ కోబి నడ, సెమీ, ఉయిల్మగ, ఆమ్రుత్మద తర్కరి, అలూ-బైగన్, పొద, కర్ది, హనూ తర్కరి ప్రారంభమైంది

బడి తకరి, కర్ది భాజ, సెమీ బైగన్, కాంకేర్ మహుర్,

  • సూప్: ఝుంగ, బందుల్ డెల్, రెహెల్ డెల్, ముంగ్ డెల్, చనా డెల్, బడి ఝొల్,
  • సోర్ వెజిటబుల్: ప్రధాన, మూలా-ప్రధాన, ఆమిల్, కఖరు సక్ర, భెనిఖత, టమటొఖత, ఆమ్ ఛట్నీ, కకుది సక్ర, పీజ్ఖత, పతల్ఘంత పట్టా, అమూల్ ఝొల్, తెతెల్ ఝొల్, ఆమ్ పట్టా,
  • లీఫ్ కరివేపాకు: భజిసగ్, బహల్సగ్, కులెర్సగ్, ఛెంచ్సగ్, కుందసగ్
  • స్నాక్: ఖుద్మ, ఛకెల్, తెలెన్ పీట, పొద పీట,
  • స్వీట్: ', అర్స పీట, పొధ్పిథ, మద, సుజిమద, టిల్లదు, ఖజ, ఖజలదు, ఫెని, బుందిలడ్డూ
  • చేపల కూర: మాక్ ఫుర్గ, ప్రధాన మాక్, బిగ్ మాక్, మాస్ల మాక్
  • మాంసం కూర: కుకుదమన్ష్ తర్కరి, మాస్ ఖర్ద (మటన్ / లాంబ్), మాస్ తర్కరి (మటన్ / లాంబ్), మాస్ భాజ, హద్బందు

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

భవానీపట్నం పరిసరాలలో

[మార్చు]
  • భవనిపత్న: శతాబ్దాల పాత మనికేశ్వరి ఆలయం, రాయల్ ప్యాలెస్, చ్హతర్ జాత్రా, కలాహండి ఉత్సవ్
  • అసుర్గర్గ్: ఇది 2000 సంవత్సరాల పురాతన కోట; భవనిపత్న నుండి 30 కి.మీ దూరంలో ఉంది.
  • ఫుర్లి జర్నా:; జలపాతం, సుందర ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంది. భవనిపత్న నుండి 15 కి.మీ దూరంలోఉంది
  • కర్లపత్: వన్యప్రాణి అభయారణ్యం, సహజ అందం
  • థూముల్ రాంపూర్: జలపాతం, కొండ & పర్వతాలు, పర్వతారోహణ ప్రాంతం, తేయాకు తోటలు ఉన్నాయి.
  • పెర్మంజి: కొండలు, తోట
  • రబందర్హ్: జలాశయం ; భవనిపత్న నుండి 12 కి.మీ దూరంలో ఉంది.
  • అంథగుద: పురాతన టెల్ నది నాగరికత చెందిన అంథగద్ కోట
  • బెల్ఖంది: చారిత్రాత్మక ప్రదేశం
  • లంజిగర్హ్: గ్రామం చుట్టూ ఒక పెద్ద కందకము కొన్ని కోటలు ఉన్నాయి. ఇక్కడ ప్రబలమైన గోపీనాథ్ ఆలయాలు, "డొకరి" అనే మహిళా దేవత ఉన్నారు. చైత్ర మాసంలో స్థానిక ఝమి యాత్ర లేదా ఝము యాత్ర (మార్చి - ఏప్రిల్)కు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. ఉత్సవ సమయంలో పలువురు భక్తులు నిప్పులు త్రొక్కడం ఆచారంగా ఉంది.
  • మొహంగిరి: కొండలు, ఇతర సహజ సౌనర్యవంతమైన ప్రదేశం మద్య ఉన్న శివాలయం
  • బుధిగర్హ్:
  • తల్గుద కోట:
  • మర్దిగూడ:
  • కుసుర్ల, సపగరంద: సంబంధమైన కేంద్రాలు

ధర్మార్గ్

[మార్చు]
Sri Aurobindo Kendra, Dharamgarh, Kalahandi
Sri Aurobindo Relics Center, Dharamgarh, Kalahandi
  • కొక్సర
  • గొలముంద
  • జునాగఢ్: లంకేష్వరి ఆలయం, దషిబమన ఆలయం, కనకదుర్గ ఆలయం, ఖందబష, వంటి ఆకర్షణలున్న చారిత్రక ప్రదేశం.
  • ముఖిగుద: ఇక్కడ ఆసీ లోని 2 వ అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్, ఇంద్రావతి ఆనకట్ట ఉంది
  • ఢరమ్గర్హ: పరదేశ్వర్ ఆలయం, భింఖొజ్, నగ్బొం, కలాహండి చైత్ర ఉత్సవ్
  • అంపని: బుధరజ ఆలయం, జలపాతం, సహజ అందం
  • గూడహంది: చారిత్రాత్మిక ప్రదేశం

[52]

  • దొక్రిచంచ్ర: జలపాతం, అందమైన ప్రదేశం.
  • చురా డంగర్: ఇక్కడ పర్వతారోహణ ప్రాంతం, జలపాతాలు వంటి ఆకర్షణలు ఉన్నాయి.
  • ఖైర్పదర్: హస్తకళ గ్రామం
  • శ్రీ అరబిందో పునరావశేషాలను కేంద్రం, ఇక్కడ మహాయొగి శ్రీ అరబిందో, తల్లి యొక్క ధరంగర్హ్- పవిత్ర అవశేషాలు ఉన్నాయి.

ప్రముఖులు

[మార్చు]
  • రిండోమఝి: ఒడిషాలో స్వాతంత్ర్య సమర యోధుడు. 1840లో ఈయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కొంఢా ఉద్యమం ఆరంభించాడు.

.[53]

  • ప్రతాప్ కేసరి దేవ్ : కలాహండి రాజాస్థానానికి చెందిన మహారాజా. 1950-1979 వరకు కలాహండి నియోజక వర్గం నుండి పార్లమెంటు సభుడుగా ఎన్నిక చేయబాడ్డాడు. కలాహండిలోని " అప్పర్ ఇంద్రావతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ " ప్రారంభించడానికి కృషిచేసాడు.
  • సుజిత్ మెహర్:- ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్, పారిశ్రామిక వేత్త.

.[54][55]

  • భువనేశ్వర్ బెహెర :- ఇంజనీర్, విద్యావేత్త, నిర్వాహకుడు, రచయిత.[56]
  • రాం చంద్ర పాత్రా:- కలాహండిలో మొదటి ఐ.ఎ.ఎస్ (1919-2013), ప్రభుత్వాధికారి, సాంఘసేవకుడు, ఇద్రవతి ప్రాజెక్ట్ ప్రారంభ నిర్వాహకుడు.[57][58]
  • ప్రపుల్ల రాథా : ఒరియా డ్రామాలో నటించి " నాట్యరాష్మి " అవార్డును అందుకున్నాడు.[59]
  • దయానిధి నాయక్ : దలిత్ లీడర్, కలాహండికి చెందిన గతంలో మంత్రి పదవి చేపట్టాడు. ఆయన అందించిన ప్రజాసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రజాదరణ పొందాయి.

[60]

  • కిషన్ పాట్నాయక్ :- సాంఘిక నాయకుడు.[61][62]

ఆయన 1930లో కలాహండిలో దిగువ మధ్యతరహతిలో జన్మించాడు. సమాజ్వాది యువన్ సభలో యువవిభాగానికి ఆయన పనిచేసాడు. త్వరలోనే దానికి జాతీయ నాయకుడు అయ్యాడు. ఆయన తన 32వ వయసులో సంబల్‌పూర్ పార్లమెంటు సభ్యుడుగా ఎన్నిక చేయబడ్డాడు. తరువాత జాతీయ ముఖ్యత్వం కలిగిన విషయాలను చర్చించడానికి తగినంత మంది సభ్యులతో ఫోరం ఏర్పాటు చేసాడు. కలాహండిలోని ఆకలి మరణాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వచ్చిన మొదటి ప్రాలమెంటు సభ్యుడుగా ఆయన గుర్తించబడ్డాడు. గ్రామీణభారత దుస్థితి, గ్రామీణ అభివృద్ధి మీద నుండి ఆయన ఎప్పటికీ తన దృష్టిని మరల్చలేదు.[63]

దస్త్రం:Kishen Pattanayak.jpg
Kishen Pattanayak, Former MP & Social Activist
  • జయంత కుమార్ బెహరా :- ఈయన సంఘ సేవకుడు, కళాకారుడు. అంతేకాక ఘుమురా నృత్యగురువుగా పనిచేసాడు. ఆయన ఘుమురా నృత్యానికి ప్రజాదరణ తీసుకు వచ్చి జాతీయ, అంతర్జాతీయ గురింపు రావడానికి దశాబ్ధాల నుండి కృషిచేసాడు. ఆయన సమీపకాలంలో " సరళ సమ్మన్ " అందుకున్నాడు.

విద్య

[మార్చు]

2004లో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన " వెస్టర్న్ ఒడిషా డెవెలెప్మెంటు కౌందిల్ " సౌత్ ఇండియా ఆధారిత సంస్థ అనుబంధంగా జునాగర్ మండలంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌ను స్థాపించారు. ఒడిషా ప్రభుత్వ " ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్: కలాహండి", 2009లో భవానీపట్న వద్ద అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేస్తూ ప్రకటించింది.

  • గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ (కలాహండి), .
  • అగ్రికల్చరల్ కాలేజ్, భవానీపట్న
  • ప్రభుత్వ అటానమస్ కళాశాల
  • సర్దార్ రాజా మెడికల్ కాలేజ్ (జరింగ్) (ప్రైవేట్).
  • అగ్రికల్చరల్ కాలేజ్ (ధర్మగర్), ప్రైవేట్ కాలేజ్. రవిశంకర్ ప్రతిపాదన[64]

హాస్పిటల్స్

[మార్చు]
  • జిల్లా కేంద్రం ఆస్పత్రి, భవానిపాట్నా
  • సబ్ డివిజనల్ హాస్పిటల్, ఢరమ్గర్హ
  • జీవితం విలువ హాస్పిటల్, భవానిపాట్నా
  • ఖరియార్ ఎవాంజెలికల్ హాస్పిటల్, ఖరియార్

మాధ్యమం

[మార్చు]
  • ఆల్ ఇండియారేదేవ్ (భవానీప్రియ)
  • హై పవర్ (10 కి.వా) TV ట్రాన్స్మిటర్ : భవానీపట్నం సమీపంలో
  • అభియుత్తనం (ఒరియా మాస పత్రిక)

ఎస్టాబ్లిష్మెంట్

[మార్చు]
  • ఎగువ ఇంద్రావతి జల విద్యుత్ ప్రాజెక్ట్, ముఖిగుడా
  • వేదాంత అల్యూమినా రిఫైనరీ లాంజిగర్ (ప్రైవేట్)

రాజకీయాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజక వర్గాలు

[మార్చు]

The following is the 5 Vidhan sabha constituencies[65][66] of Kalahandi district and the elected members[67] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
77 లాంజీఘర్ షెడ్యూల్డ్ తెగలు లాంజీఘర్, తుయాముల్ రాంపూర్, జైపాట్నా (భాగం), , భవానీపాట్నా (భాగం) Shibaji Majhi ఐ.ఎన్.సి
78 జునాగఢ్. లేదు జునాగఢ్ (ఎన్.ఎ.సి), జునాఘర్ (ఎన్.ఎ.సి), జునాఘర్, గొలమునా. గోబర్ధంబ్దాష్ ఐ.ఎన్.సి
79 ధర్మార్గ్ లేదు ధర్మార్గ్, కొక్సర, కలంపూర్, జైపాట్నా (భాగం) పుష్పేంద్ర సింగ్ దేవ్ బి.జె.డి ]]
80 భవానిపట్న షెడ్యూల్డ్ కులాలు భవానీ పాట్నా (ఎం), కెసింగ (ఎన్.ఎ.సి), భవానీ పాట్నా (భాగం) కెసింగ (భాగం) దుష్మంత నాయక్ ఐ.ఎన్.సి
81 నర్ల లేదు నర్ల, కర్లముండ, మదంపూర్- రాంపూర్, కెసింగ (భాగం) భూపీందర్ సింగ్ ఐ.ఎన్.సి

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. B.Mishra, J. Bengal Art, Vol.9&10, 2004–2005, 383–410
  3. 3.0 3.1 P.Mohanty, B. Mishra, Op. Cit,2000; C.R. Mishra, S. Pradhan, op. cit. 1989–1990, Infra, F.N.79
  4. 4.0 4.1 4.2 "The Kalahandi Syndrome: Starvation in Spite of Plenty DEVINDER SHARMA* 19apr02". Mindfully.org. Archived from the original on 2013-04-20. Retrieved 2013-05-22.
  5. R.P.Prusty, 1992, Paleolithic Vestiges from Kalahandi, Orissa Historical Research Journal, XXXVII, no.1-5, pp.55–66, Orissa State Museum, Bhubaneswar
  6. P.Mohanty, B. Mishra, Op. Cit,2001, p.47
  7. "A tale of Tel valley civilization uncovered". The New Indian Express. Archived from the original on 2014-01-09. Retrieved 2010-10-21.
  8. Mahabharata Sabhaparva, 31, sloka-11-16
  9. Proceedings, Indian History Congress, 1947, 10th session, 178
  10. H. C. Rayachoudhury, Political History of Ancient India, 538
  11. B. Mishra, op.cit., 2003–2004
  12. 12.0 12.1 N. K. Sahu, 1964, op. cit.
  13. N. K. Sahu, op.cit., 1964, p.200
  14. ibid.7
  15. N. K. Sahu, Utkal University, History of Orissa, 433
  16. S.P.Tiwari, Comprehensive History of Orissa, 95–96
  17. J. P. Singh Deo, op.cit.
  18. M.N.Das(Ed)Sidelight on History and Culture of Orissa, 36
  19. Orissa District Gazetters, Kalahandi, 46–49
  20. ibid.47
  21. ibid.41
  22. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-11. Retrieved 2014-10-16.
  23. Indian Literature, Sahitya Akademi's Bi-monthly Journal, Volume LI, క్ర.సం 6, page 47-48. New Delhi ISSN 0019-5804.
  24. "Hunger Pangs Through A Lens Eye". Financial Express. 2003-01-19. Retrieved 2013-05-22.
  25. "I saw Kalahandi in Bengal: Rahul Gandhi". India Today. 2009-04-25. Retrieved 2013-05-22.
  26. "Central University in Kalahandi Part1". YouTube. 2011-10-18. Retrieved 2013-05-22.
  27. "Central University in Kalahandi Part2". YouTube. 2011-10-18. Retrieved 2013-05-22.
  28. "Central University in Kalahandi Part3". YouTube. Retrieved 2013-05-22.
  29. The New Indian Express, Bhubaneswar Edition, 8 May 2008
  30. The Statesman, Bhubaneswar Edition, 11 August 2008
  31. "The Pioneer". Pioneer. 1970-01-01. Retrieved 2013-05-22.
  32. The Telegraph (Kolkata), 29 December 2008
  33. The New Indian Express, Bhubaneswar Edition, 28 December 2008
  34. "RITES, SAIL to sign pact on wagon manufacturing unit". Financial ఎక్స్‌ప్రెస్. Retrieved 2013-05-22.[permanent dead link]
  35. Orissa District Gazetters, Kalahandi, 2
  36. 36.0 36.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  37. "Special Area Development Project For K.B.K Districts Of Orissa". Kbk.nic.in. Retrieved 2013-05-22.
  38. P.Mohanty, B.Mishra, Environment and stone age culture of Kalahandi, Orissa in Peoples and Environment in India, edited by K.K.Mishra, M.L.K.Murty, p.42
  39. "Vedanta Aluminium, Orissa, India, Smelter, Captive Power Plant (CPP), Mining, Corporate Social Responsibility (CSR), Kalahandi, Niyamgiri, Jharsuguda, Aluminium Company". Vedantaaluminium.com. 2012-07-15. Archived from the original on 2013-05-30. Retrieved 2013-05-22.
  40. "'Avatar' tribe defeats Vedanta : North, News - India Today". Indiatoday.intoday.in. 2010-08-25. Retrieved 2013-05-22.
  41. "Government halts construction work at Vedanta refinery". Hindustan Times. 2010-10-21. Archived from the original on 2011-02-06. Retrieved 2013-05-22.
  42. "Bhawanipatna railway station opens". The New Indian Express. Archived from the original on 2013-05-21. Retrieved 2013-05-22.
  43. "East Coast Railway". Eastcoastrail.indianrailways.gov.in. 2012-08-11. Archived from the original on 2013-12-14. Retrieved 2013-05-22.
  44. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  45. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582
  46. M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
  47. Kalahandi: Loka Anusthan, Edited by Jayanta Kumar Behera, Dr Dolagobinda Bisi, Parameswar Mund, Mahabir Sanskrutika Anusthan, 1998
  48. C. Pasayat, (Ed.) (2008), Paschima Odisara Lokageeta (in Oriya), Bhubaneswar: Folklore Foundation
  49. Loka Nutrya Ghumura, Edited by Parameswar Mund, Mahabir Sanskrutika Anusthan, June 2002
  50. The Heroic Dance Ghumura, Edited by Sanjay Kumar, Mahabir Sanskrutika, 2002
  51. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-20. Retrieved 2014-10-16.
  52. "Places of interest in the district". Archived from the original on 2014-12-27.
  53. D.K. Joshi, S. Mund, M.P.Mishra, The Kandha Revolution in Kalahandi, Orissa Review, Aug 2007
  54. "Sujit Meher : Indigenous Fashion Designer of Dharamgarh to Promote Sambalpuri ethnic garments – Odisha". www.eodisha.org/. Archived from the original on 2013-11-11. Retrieved 2013-11-04.
  55. "Rising Star - Sujit Meher". Mumbai, India: youth incorporated magazine. Archived from the original on 2014-01-07. Retrieved 2014-01-04.
  56. Sambit Misra (2001-04-25). "Professor Bhubaneswar Behera". Odiya.org. Archived from the original on 2015-09-24. Retrieved 2013-05-22.
  57. Samabad, 2000
  58. Keun Mahatabanak Pain, Gana nath Das, The Prajatantra, 2 January 1988
  59. "Akashvani, Bhawanipatna - Home". Airbpn.org. Archived from the original on 2012-08-02. Retrieved 2013-05-22.
  60. Kalahandi Express, Sept 2010
  61. "Obituary". Cpiml.org. 2004-10-08. Archived from the original on 2013-05-25. Retrieved 2013-05-22.
  62. "Socialist leader Kishan Patnaik dead - Deccan Herald". Archive.deccanherald.com. 2004-09-27. Archived from the original on 2015-09-25. Retrieved 2013-05-22.
  63. "Kishan Patnaik remembered". The Hindu. Chennai, India. 30 September 2004. Archived from the original on 24 నవంబరు 2004. Retrieved 16 అక్టోబరు 2014.
  64. "India is caught between scams and slums: Sri Sri Ravi Shankar". Indian Express. 2010-12-17. Retrieved 2013-05-22.
  65. Assembly Constituencies and their EXtent
  66. Seats of Odisha
  67. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

కలాహండి (Kalahandi) ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. నాగావళి నది ఈ జిల్లాలోనే పుట్టి, తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది..

వెలుపలి లింకులు

[మార్చు]